Salt And Sugar Contain Microplastics,sensational study(X)

ఈ మధ్యకాలంలో చక్కెర వినియోగం రోజురోజుకు పెరుగుతుంది. ముఖ్యంగా స్వీట్లు, కాఫీ, టీ ,శీతల పానీయాలు ,బేకరీ ఐటమ్స్ వంటి వాటిలలో చక్కెరను అధికంగా వాడుతున్నారు. ఎక్కువ చక్కెరను మన శరీరం తీసుకోవడం ద్వారా ఇది చాలా హారికరంగా మారుతుంది. కేవలం బరువు పెరగడం మాత్రమే కాకుండా అనిక అవయవాలను కూడా దెబ్బతిస్తుంది. ముఖ్యంగా షుగర్ ను ఎక్కువగా తినడం వల్ల ఎటువంటి జబ్బులు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె జబ్బులు- చక్కెరను అధికంగా తీసుకోవడం వల్ల గుండెపైన ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. ముఖ్యంగా ఐస్ క్రీమ్లు, కేకలు, కూల్డ్రింక్స్, డెసర్ట్ లో ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాల్లో చక్కర అధికంగా ఉంటుంది. ఇది మీ శరీర భరోను పెంచడానికి దారితీస్తుంది. అంతేకాకుండా శరీరంలో కొలెస్ట్రాల్ పెంచుతుంది. గుండెజబ్బుల ప్రమాదం పెరుగుతుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ట్రై గ్లిజరయిడ్స్ పెరుగుతాయి. ఇది రక్త సరఫరాను తగ్గిస్తుంది. దీనివల్ల రక్తపోటు కొలెస్ట్రాల స్థాయిలో మరింతగా పెరుగుతాయి. దీని ద్వారా స్ట్రోక్ గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: మటన్ కన్నా ఎక్కువ ప్రోటీన్ ఉన్న శాఖాహారం ఏంటో తెలుసా.

షుగర్- చక్కెర  ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలో పెరుగుతాయి. ఇది శరీరంలోని ఇన్సులిన్ నిరోధకతను కలిగిస్తుంది. దీని వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రధానంగా వస్తుంది. అధిక దాహం, తరచుగా మూత్ర విసర్జన, బరువు పెరగడము తగ్గడము కాళ్లు చేతిలో నరాలలో ఇబ్బందులకు గురి కావడం వంటి సమస్యలు ఏర్పడతాయి.

కొలెస్ట్రాల్ పెరుగుతుంది- అధికంగా చక్కెరను వాడడం ద్వారా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అంతేకాకుండా ట్రై గ్లిజరైడ్స్ కూడా పెరుగుతాయి. దీనివల్ల శరీరంలో ఉన్న రక్తనాళాలలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది రక్త ప్రసరణను అడ్డుకుంటుంది. దీనివల్ల గుణ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఫ్యాటీ లివర్- తీసుకోవడం ద్వారా కాలేయం కూడా ఇబ్బందికి గురి అవుతుంది. ఎక్కువ చక్కెర తీసుకోవడం ద్వారా ఫ్యాటీ లివర్ సమస్య ఏర్పడుతుంది. ముఖ్యంగా దీన్ని నాన్ ఆల్కహాల్ ఫ్యాటీ లివర్ అని అంటారు. దీనివల్ల కడుపుబ్బరం కడుపులో నొప్పి జీల సమస్యల వంటివి ఏర్పడి ఒక్కొక్కసారి కాలేయ వైఫల్యానికి కూడా కారణం అవుతుంది.

బరువు పెరుగుతారు- అధికంగా చక్కెర తీసుకోవడం ద్వారా కేలరీలో పెరుగుతాయి. దీని ద్వారా శరీర బరువు పెరుగుతుంది. దీనివల్ల అనేక జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల షుగర్ త్వరగా జీర్ణం కాకపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే డైటింగ్ చేసేవారు తప్పకుండా శ్రద్ధ వహించాలి. బరువు తగ్గాలనుకునేవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి