Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా. ఎటువంటి ఆహారాలు తినాలి ఎటువంటి ఆహారాలు తినకూడదు ఇప్పుడు తెలుసుకుందాం..
మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
ఈ మధ్యకాలంలో చాలామందిలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్ సమస్య. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువగా ఏర్పడుతుంది. ఫ్యాటీ లివర్ అనగా కాలేయంలో అధికంగా కొవ్వు ఏర్పడే పరిస్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు. దీని వల్ల ఒక్కొక్కసారి ప్రాణాంతకమైన వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా లివర్ సిర్రోసిస్, కాలేయ క్యాన్సర్ వంటివి ఏర్పడతాయి. దీన్ని సరైన సమయంలో మనం నయం చేయకపోతే చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తుంది. అయితే ఈ సమస్యను మనము ఆహారంతో కూడా తగ్గించుకోవచ్చు. సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనము ఫ్యాటీ లివర్ సమస్యను తగ్గించుకోవచ్చు .అయితే ఫ్యాటీ లివర్ సమస్యతో ఉన్నవారు ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
బయటి ఆహారం- చాలామంది బయట ఫుడ్ ను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా వేయించిన ఆహార పదార్థాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటివి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. వీళ్ళలో ఎక్కువగా ఫ్యాట్స్ ఉంటాయి. దీన్ని తీసుకోవడం ద్వారా మీకు ఫ్యాటిలివ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
స్వీట్లు, బ్రెడ్- చక్కెర అధికంగా ఉన్న ఆహార పదార్థాలు ముఖ్యంగా కార్బోహైడ్రేట్లు, బ్రెడ్, కేకులు వంటివి ముఖ్యంగా తీసుకోకూడదు. ఇవి తీసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ ఉన్నవారికి చాలా హానికరం. ఇది అధికంగా ఉన్న కార్బోహైడ్రేట్లను చక్కెరను కాలేయంలో కొవ్వుగా నిల్వ చేస్తుంది. అంతేకాకుండా కూల్డ్రింక్స్ వంటివి వాటిని కూడా మానుకుంటే ఫ్యాటీ లివర్ సమస్య నుంచి బయటపడవచ్చు.
Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..
ఆల్కహాల్- ఫ్యాటీ లివర్ రావడానికి అతిపెద్ద కారణాల్లో మొదటిది ఆల్కహాల్ ఇది ఫ్యాటీ లివర్ రావడానికి కారణం అవుతుంది. అంతేకాకుండా ఇది కాలయంలో ఉన్న కణాలను దెబ్బతీస్తుంది. ఫ్యాటీ లివర్ సమస్యను మరింతగా పెంచుతుంది. ఫ్యాటిలివర్ సమస్యతో ఉన్నవారు ఆల్కహాల్ ను పూర్తిగా మానేయాలి.
ట్రాన్స్ ఫ్యాట్స్- ట్రాన్స్పోర్ట్ లో అధికంగా ఉన్న ఆహారాలు కొవ్వును ఎక్కువగా కాలేయంలో నిలువ ఉంచుతాయి. అంతేకాకుండా లివర్ వాపు కూడా కారణం అవుతాయి. ఇది ఎక్కువగా ప్రాసెస్ చేయడం ఆహార పదార్థాలలో ముఖ్యంగా బేకరీ ప్యాక్ చేసిన ఆహారాలలో ఉప్పు ఎక్కువగా ఉన్న స్నాక్స్ లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది వీటిని మానేయాలి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి