Health Tips: తరచుగా కడుపు నొప్పితో బాధపడుతున్నారా..వాముతో తక్షణం ఉపశమనం

కడుపునొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఏ పని చేయలేము కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది.

ajwan

మనలో చాలామంది తరచుగా కడుపునొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కడుపునొప్పి వచ్చినప్పుడు ఒక్కోసారి తీవ్ర ఇబ్బందికి గురి కావాల్సి వస్తుంది. ఏ పని చేయలేము కొంత ఇబ్బందికరంగా కూడా అనిపిస్తుంది. చాలామంది కొన్ని రకాలైన మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. వీటివల్ల కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే లభిస్తుంది. అయితే వీటి వల్ల ఒక్కొక్కసారి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అలా కాకుండా మనం ఇంట్లోనే కొన్ని చిట్కాలతోటి మన వంటింట్లో దొరికే ఒక మసాలా దినుసు తోటి కడుపునొప్పిని తగ్గించుకోవచ్చు. అయితే మన ఇంట్లో ఉండే వాము తోటి కడుపు నొప్పిని ఐదు నిమిషాల్లో తగ్గించుకోవచ్చు..

వాము- వాము ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది గ్యాస్, ఎసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా కడుపు నొప్పితో ఇబ్బంది పడే వారికి వాము చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. ఇది ఆయుర్వేద ఔషధంగా చెప్పవచ్చు. అంతేకాకుండా వాములో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా చాలా ఉంటాయి. ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేలా చేస్తుంది. ఫైబర్ వల్ల మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. దీన్ని తీసుకోవడం ద్వారా అజీర్ణము వంటి సమస్య కూడా తగ్గుతుంది.

Health Tips: పురుషులతో పోలిస్తే మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువ ...

ఎలా వాడాలి- కడుపు నొప్పితో బాధపడేవారు వాముని దోరగా వేయించుకొని పొడి చేసుకొని దానిని ఒక స్పూన్ వేసుకొని వాటర్ తాగినట్లయితే తక్షణమే కడుపునొప్పి తగ్గుతుంది. చిన్నపిల్లలకు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. దీన్ని వాడడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.  కడుపు నొప్పి రావడానికి ఒక్కొక్కసారి మనము తీసుకున్న ఆహారం జీర్ణం కాకపోవడం మన శరీరానికి సరైనటువంటి ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఈ కడుపునొప్పి అనేది ఇబ్బంది పెడుతుంది. అటువంటి అప్పుడు వాముని మీరు ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే కడుపునొప్పి, అజీర్ణము వంటి సమస్యలు తగ్గిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



సంబంధిత వార్తలు

Weather Forecast: ఏపీ వెదర్ అలర్ట్, వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని ఐఎండీ హెచ్చరిక, తెలంగాలో పెరుగుతున్న చలి

KCR Condolence To Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల కేసీఆర్ దిగ్భ్రాంతి.. మన్మోహన్ సింగ్ హయాంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం చారిత్రక సందర్భం అని వ్యాఖ్య

Dr Manmohan Singh Dies: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూత‌, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మ‌ర‌ణించిన రాజ‌కీయ దురంధ‌రుడు

Dr Manmohan Singh Dies?: మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు, సోష‌ల్ మీడియాలో పోస్టు పెట్టి డిలీట్ చేసిన రాబ‌ర్డ్ వాద్రా, కాంగ్రెస్ పార్టీ నుంచి రాని క్లారిటీ