మన శరీరానికి రక్తం చాలా అవసరం. రక్తం తగ్గడం వల్ల శరీరంలో అనేకమైన వ్యాధులు వస్తాయి. తక్కువ ఐరన్ హిమోగ్లోబిన్ వల్ల వచ్చే వ్యాధిని రక్తహీనత అంటారు. రక్తహీనత వల్ల అనేక రకాల జబ్బులు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా ఉంటుంది. రక్తం తక్కువగా ఉన్నప్పుడు శరీరానికి కావాల్సిన భాగాలకు ఆక్సిజన్ సరఫరా జరగదు. దీనివల్ల అనేక రకాలైనటువంటి వ్యాధులు వస్తాయి. అయితే మహిళల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది.
మహిళల్లో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండడానికి కారణాలు.
పోషకాహార లోపం- మహిళల్లో రక్తహీనత సమస్యకు ప్రధాన కారణం పోషకాహార లోపం. వీరు ఆహారంలో ఐరన్ తక్కువగా ఉండటం వల్ల ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ సమస్య గ్రామీణ ప్రాంతాల మహిళల్లో రక్తహీనత సమస్య ఎక్కువగా ఉంటుంది. చాలా మంది మహిళలు ఆహారం పైన ఆధారపడతారు. ఇది ఐరన్ లోపాన్ని పెంచుతుంది. అయితే మొక్కలతో మొక్కల ఆహారాలతో పోలిస్తే జంతువుల ఆహారం మాంసాహారం వంటి వాటిలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.
విటమిన్ బి12 లోపం- కొంతమంది మహిళల్లో విటమిన్ బి12 లోపం ఉంటుంది. దీని కారణంగా శరీరంలో రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. విటమిన్ బి12 లోపం వల్ల కూడా అనేక రకాల మైనటువంటి వ్యాధులు వస్తాయి. ఇది రక్తహీనత సమస్యకు కారణం అవుతుంది.
Health Tips: మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు కనిపించే సంకేతాలు
తరచుగా గర్భం దాల్చడం- కొంతమంది మహిళలు తరచుగా ఎక్కువసార్లు గర్భవతి అవుతుంటారు. ఇటువంటి వారిలో వారికి రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. కొంతమంది మహిళల్లో నార్మల్ డెలివరీ అవుతుంది. అంతేకాకుండా కొన్నిసార్లు అబార్షన్ అయినప్పుడు కూడా ఈ సమస్య మరింత తీవ్రమౌతుంది. గర్భధారణ సమయంలో రక్తస్రావం సహజం ప్రసవ సమయంలో అధికంగా రక్త నష్టం జరగడం వల్ల రక్తహీనత సమస్యకు దారితీస్తుంది.
పీరియడ్స్- కొంతమంది మహిళలు రుతుస్రావ సమయంలో అధిక రక్తస్రావాన్ని కలిగి ఉంటారు. దీని వల్ల కూడా రక్తహీనత సమస్య ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది . బాధపడేవారు కచ్చితంగా వైద్యుని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కొన్నిసార్లు తీవ్రమైన అనారోగ్య పరిస్థితికి కారణమవుతుంది.
హిమోగ్లోబిన్ పెంచే ఆహార పదార్థాలు- ప్రతిరోజు ఒక ఆపిల్ పండు తినడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. బీట్రూట్, క్యారెట్, వంటివి కూడా రక్తహీనతను తగ్గిస్తాయి. పాలకూర కూడా ఐరన్ అధికంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఉసిరికాయలను ప్రతిరోజు తీసుకోవడం వల్ల కూడా రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి