Health Tips: అధిక కొలెస్ట్రాల్ తో బాధపడుతున్నారా..అయితే ఏ ఆహార పదార్థాలు తినాలి ఏ ఆహార పదార్థాలు తినకూడదు.

దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

best health tips for reduce belly fat, simple tips for decrease belly fat(X0

ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరిలో కూడా కొలెస్ట్రాల్ సమస్య కనిపిస్తూనే ఉంది. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే జీవన శైలిలో మార్పు, పోషకాహార లోపం, మద్యపానం నిద్రలేమి వంటి వాటిల్లో కారణంగా మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఈ కొలెస్ట్రాల్ పెరగడం ద్వారా అనేక రకాలైనటువంటి జబ్బులు వస్తాయి. ముఖ్యంగా LDL కొలెస్ట్రాల్, HDL కొలెస్ట్రాల్ రెండుగా ఉంటాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ అయితే మీకు గుండె జబ్బులు వంటివి వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు. ఏ ఆహార పదార్థాలు తీసుకోవాలి ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం.

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఏ తినాలి.

కొలెస్ట్రాల్ మీకు ఎక్కువగా ఉంటే మీరు కచ్చితంగా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోండి. కార్బోహైడ్రేట్స్, ఆయిల్ ఫుడ్స్ ను ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. ఫైబర్ అధికంగా ఉండడం కోసం ఓట్స్, చిక్కుళ్ళు ,తీసుకోవాలి. అంతే కాకుండా మీరు వైట్ రైస్ కు బదులుగా బ్రౌన్ రైట్స్ ,మిల్లెట్స్ తీసుకోవాలి. వీటితోపాటు ఆపిల్ ,నారింజ, బెర్రీ పండ్లు వంటికి తీసుకోవాలి. ముఖ్యంగా ఆకుపచ్చ కూరగాయలు కూడా తీసుకోవాలి. గ్రీన్ టీ, దానిమ్మ రసం, సోయా మిల్క్ వంటివి తీసుకున్నట్లయితే మీకు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుంది. ఒకవేళ మీరు గుడ్ ఫ్యాట్స్ అయినటువంటి ఒమేగా  సాల్మన్ ఫిష్లను అవకాడో, బాదం, వాల్నట్లను ,అవిస గింజలను తీసుకోవాలి. మీరు కొవ్వు లేని పాలను తక్కువ కొవ్వు ఉన్న పెరుగును తీసుకోవాలి. అంతేకాకుండా మీరు ఆలివ్ ఆయిల్ ను, ఆవనూనెను వంటి వాటిని తీసుకున్నట్లయితే ఇందులో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు ఏమి తినకూడదు.

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు ముఖ్యంగా నెయ్యి, వెన్న, రెడ్ మీట్, వంటి వాటి తీసుకోకూడదు. ముఖ్యంగా క్రీమ్ ఉన్న పాలను ,క్రీమ్స్ కేక్, స్వీట్స్, వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా ప్యాక్ చేసిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన వంటి ఫుడ్స్ జంక్ ఫుడ్స్,  చిప్స్ ,సమోసాలు వంటి వాటిని అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా ప్యాకెట్ లో ఉన్నటువంటి జ్యూస్ లను, ఫ్రైడ్ ఫుడ్స్ ను తినడం మానేయాలి. అంతేకాకుండా అధిక కొవ్వు ఉన్నవారు లివర్ ,భేజా వంటి అవయవ మాంసాలను అస్సలు తీసుకోకూడదు. అంతేకాకుండా వీరు అధికంగా ఉన్న చక్కెర ఆహారాలను ఉప్పు ఆహారాలను అస్సలు తీసుకోకూడదు. అదిగో కొలెస్ట్రాల్ ఉన్నవారు ఎక్కువ నీటిని తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేసుకొని అధిక బరువు తగ్గినట్లయితే వీళ్ళ కొలెస్ట్రాల్ తగ్గడానికి సహాయపడుతుంది.

కొలెస్ట్రాల్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు.

రక్తనాళాల్లో గడ్డలు-అధిక కొలెస్ట్రాల్ సమస్య ఉన్నప్పుడు ధమనులలో కొలెస్ట్రాల్ పేరుకు పోతుంది. అప్పుడు రక్తనాళాల్లో ప్లేస్ తక్కువైపోయి రక్త ప్రసరణ చాలా స్పీడ్ గా జరుగుతుంది. దీనివల్ల హార్ట్ ఎటాక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

గుండెపోటు- అధిక కొలెస్ట్రాల్ వల్ల గుండెలో బ్లాక్స్ ఏర్పడతాయి. ఇది రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. కాబట్టి గుండెకు తగినంత ఆక్సిజన్ లభించదు. అటువంటి అప్పుడు హాట్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

బ్రెయిన్ స్ట్రోక్: అధిక కొలెస్ట్రాల్ వల్ల మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ధమనుల్లో రక్త ప్రవాహం తగ్గిపోతుంది. కాబట్టి ఇది మెదడులోని భాగాలకు ఆక్సిజన్ ను అందనియ్యదు అటువంటి పరిస్థితుల్లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif