Health Tips: కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారా.ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.

దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.

liver

కామెర్లు అనేది తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ముఖ్యంగా మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు. దీని ద్వారా మన లివర్ వాపుకు గురవుతుంది. అంతేకాకుండా సిరోసిస్ క్యాన్సర్ వంటి తీవ్రమైన జబ్బులకు దారితీస్తుంది.

కామెర్లు ప్రధానంగా ఐదు రకాలు

హెపటైటిస్ A: ఇది కలుషిత నీరు ద్వారా కలుషిత ఆహారం ద్వారా వ్యాపిస్తుంది. ఇది సరైన సమయంలో చికిత్స తీసుకుంటే తొందరగా నయం అవుతుంది.

హెపటైటిస్ B: ఇది రక్తమార్పిడి ఇంజక్షన్స్ ద్వారా లైంగిక ద్వారా వ్యాప్తిస్తోంది. దీన్ని సకాలంలో చికిత్స చేయించుకోకపోతే క్యాన్సర్ వంటి కారకాలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది.

హెపటైటిస్ C: ముఖ్యంగా ఇది భక్త మార్పిడి ద్వారా సంక్రమిస్తుంది. ఇది దీర్ఘకాలికంగా ఉంటుంది. దీన్ని సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకోకపోతే లివర్ సిర్రోసిస్ అనే వ్యాధి వస్తుంది.

Health Tips: మధ్యాహ్నం అరగంట నిద్రతో ఎన్ని లాభాలు తెలుసా.

హెపటైటిస్ D: ఇది కేవలం హెపటైటిస్ బి ఉన్న వ్యక్తిలో మాత్రమే ఇది వస్తుంది. దీనికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

హెపటైటిస్ E: కలుషితమైన ఆహారం ,నీరు తీసుకోవడం ద్వారా సంక్రమిస్తుంది. ఇది సాధారణంగా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. గర్భిణీ స్త్రీలలో వస్తే మాత్రం ఇది తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది.

నివారణ:హెపటైటిస్ బి ని సకాలంలో గుర్తించి చికిత్స చేయకపోతే తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ద్వారా హెపటైటిస్ ఏ హెపటైటిస్ బి వాటిని తగ్గించుకోవచ్చు. వ్యక్తిగతంగా పరిశుభ్రతగా ఉంటే దీన్ని నివారించవచ్చు .కలుషిత ఆహారానికి కలుషిత నీటికి దూరంగా ఉంటే మంచిది.

సురక్షితమైన శృంగారం వల్ల దీన్ని నుండి మనం బయటపడవచ్చు.

రక్త మార్పిడి సమయంలో సరైన పరీక్ష చేసిన తర్వాత మాత్రమే రక్త మార్పిడి చేసుకుంటే వీటి నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.