Sleep Representative Image

చాలామంది మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోతూ ఉంటారు. అయితే మరి ఎక్కువ సేపు కాకుండా కేవలం ఒక 30 నిమిషాలు పడుకున్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉంటాయి. మధ్యాహ్నం నిద్ర పోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటివి? ఏ సమయంలో నిద్ర పోవాలి. ఎంత సమయం నిద్రపోవాలి తెలుసుకుందాం.

పగటి నిద్ర వల్ల కలిగే ఉపయోగాలు : పగటిపూట ఒక అరగంట సేపు మనం పడుకున్నట్లయితే మానసిక ,శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ అరగంట నిద్ర వల్ల మనం మెదడు మరింత సమర్థవంతంగా పని చేయగలుగుతుంది. నిద్ర పోవడం వల్ల మన మెదడులోని ఎడనోసింగ్ స్థాయిలను తగ్గిస్తుంది. దీని ద్వారా మనకు చురుకుదనం మెదడు పనితీరు మెరుగుపడుతుంది.

జ్ఞాపకశక్తి : కొన్ని అధ్యయనాల ప్రకారం పగటిపూట ఒక అరగంట సేపు నిద్రపోవడం వల్ల జ్ఞాపకశక్తి కాపాడుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది మీకు జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది : ప్రతిరోజు మధ్యాహ్నము 20 నుండి 30 నిమిషాల పాటు నిద్రపోయే వ్యక్తుల్లో ఒత్తిడి తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరి రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. కాబట్టి వీరు ఆందోళన ఒత్తిడి వంటి సమస్యల నుంచి ఈజీగా బయటపడతారు.

గుండెకు మంచిది: మధ్యాహ్నం పూట ఒక అరగంట నిద్రతో గుండె ఆరోగ్యానికి కూడా మెరుగుపరుస్తుంది. శరీరానికి విశ్రాంతినిచ్చి నిద్ర గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

Health Tips: షుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా

రోగ నిరోధక శక్తి:  పగటిపూట నిద్రవల్ల మనం రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. నిద్ర మన శరీరంలోని మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. శరీరం తను తాను క్లీన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. శారీరక ,మానసిక సమస్యల నుండి కూడా బయటపడవచ్చు. అంతేకాకుండా నిద్ర వల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. జీల వ్యవస్థ కూడా సక్రమంగా పనిచేస్తుంది.

ప్రతికూలతలు. అయితే కేవలం ఒక అరగంట నిద్రపోతే మాత్రం చాలా ఆరోగ్యానికి మంచిది. అలా కాకుండా రెండు మూడు గంటలు నిద్రించడం వల్ల మీరు మళ్ళీ రాత్రిపూట నిద్రకు ఇబ్బంది పడుతుంటారు. దీని వల్ల చిరాకు, అలసట, కళ్ళు తిరగడం అంటే సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి కేవలం 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతే సరిపోతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.