షుగర్ పేషెంట్లకు రైస్ మంచిదా రోటి మంచిదా. చాలామందిలో తరచుగా ఈ ప్రశ్న వినిపిస్తూ ఉంటుంది. డయాబెటిక్ పేషెంట్లకు చపాతీ మంచిదా లేక అన్నం మంచిదా అనే విషయంలో ఎప్పుడు సందేహాలు కలుగుతూనే ఉంటాయి. ఇంకొంతమంది రోటి తో పాటు అన్నం కూడా కలిపి తింటారు. ఇది కూడా సరైనదా కాదా అని అడుగుతూ ఉంటారు. అయితే మనం ఇప్పుడు ఆ విషయాల గురించి తెలుసుకుందాం
అన్నం లేదా చపాతి ఏది తీసుకోవడం ఉత్తమం.
డైటీషియన్ల ప్రకారం అన్నంలో కంటే కూడా రోటీలోనే ఎక్కువ మినరల్స్ ఉంటాయి. అయితే రెండిట్లో కూడా కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. బియ్యం లో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటే చపాతీలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రైస్ ఫైబర్ కంటెంట్ రెండు కూడా వైట్ డ్రెస్ లో తక్కువగా ఉంటాయి.
షుగర్ పేషెంట్లకు ఏది మంచిది: డయాబెటిక్ రోగులకు ఎప్పుడు ఈ ప్రశ్న తలెత్తుతూనే ఉంటుంది. చపాతి లేదా అన్నము రెండూ తినడంలో ఏది మంచిది. అనే సందేహాన్ని ఎప్పుడు వ్యక్తం చేస్తుంటారు. ఈ రెండిట్లో కూడా ఏది మేలు చేస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకు వైట్ రైస్ కంటే రోటి మంచిది. ఎందుకంటే రోటిలో రైస్ తో పోలిస్తే కార్బోహైడ్రేట్లో కాస్త తక్కువగా ఉంటాయి. అంతే కాకుండా బరువు తగ్గడానికి కూడా చపాతి మంచిది. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం ద్వారా జీర్ణ సమస్యలు ఉండవు .డయాబెటిక్ పేషెంట్లు అన్నాన్ని తీసుకుంటే అది తొందరగా జీర్ణం అవుతుంది. మళ్లీ వెంటనే ఆకలి వేయడం షుగర్ లెవెల్ పెంచడానికి కారణం అవుతుంది. అయితే చపాతి తీసుకోవడం కార్బోహైడ్రేట్లు కూడా తక్కువగా ఉంటాయి ఇవి డయాబెటిక్ పేషెంట్స్ తీసుకుంటే ఆకలి తొందరగా వేయదు. ఇది బ్లడ్ షుగర్ ని కంట్రోల్ లో ఉంచుతుంది. చపాతీలో సోడియం, క్యాల్షియం, మెగ్నీషియం ,పొటాషియం మూలకాలు అధికంగా ఉంటాయి. ఇవి బియ్యం లో చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ అన్నంతో పోలిస్తే చపాతీ తీసుకోవడం కాస్త ఉత్తమం.
Health Tips: మూత్రం పోసే సమయంలో మంట అనిపిస్తుందా...
బరువు తగ్గడానికి ఏది మంచిది.
బరువు తగ్గాలి అనుకునేవారు అన్నం కంటే చపాతీయే మంచిది. ఎందుకంటే అన్నము త్వరగా జీర్ణం అవుతుంది. వెంటవెంటనే ఆకలి వేస్తుంది కాబట్టి చపాతి బెటర్. చపాతీ తీసుకున్నట్లయితే మీరు కడుపు నిండిన అనుభూతి ఎక్కువసేపు ఉంటుంది. దీని ద్వారా తక్కువ తింటారు. బరువు తగ్గాలి అనుకున్న వారు చపాతీలను తీసుకుంటే మంచిది. అయితే చపాతీలతో పాటు కూరగాయలు ఎక్కువ మొత్తంలో తీసుకోండి దీని ద్వారా మీకు ప్రోటీన్, ఫైబర్ అధికంగా అందుతుంది. దీని ద్వారా మలబద్దంగా సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. మీ మెటబాలిజం రేటు పెరుగుతుంది. దీని ద్వారా మీరు అధిక బరువు నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.