urin

మూత్ర విసర్జన సమయంలో మంట అనిపిస్తే అది తీవ్రమైన అనారోగ్యానికి కారణం కావచ్చు. వెంటనే మీరు వైద్యుని సంప్రదించాలి. ఇది కొన్ని రకాలైన యూరినరీ ఇన్ఫెక్షన్స్ వల్ల అదే విధంగా కొన్ని రకాలైన లైంగికంగా సంక్రమించే వ్యాధులు, కిడ్నీలో స్టోన్స్, ప్రోస్టేట్  గ్రంధి వాపు కారణాలవల్ల ఇది జరగొచ్చు.

 UTI : ఇది సాధారణంగా బాక్టీరియా వల్ల మూత్రనాళంలో వచ్చే అత్యంత సాధారణ ఇన్ఫెక్షన్. పురుషుల కంటే మహిళలకు యుటిఐ వచ్చే ప్రమాదం ఎక్కువ. మూత్ర విసర్జన సమయంలో మంట సాధారణంగా బ్యాక్టీరియా వల్ల వస్తాయి.

STI : గనేరియా, కెమిడియా,హెర్పిస్, వంటి STI  వల్ల కూడ మూత్ర విసర్జన సమయంలో మంట వస్తంది. కిడ్నీ స్టోన్స్:

కిడ్నీలోరాళ్లు: కిడ్నీలో గనక రాళ్లు ఉన్నట్లయితే మూత్ర విసర్జన సమయంలో కూడా నొప్పి మరియు మంటను కలిగిస్తాయి

ప్రోస్టేట్ గ్రంధి వాపు : ఇది పురుషుల్లో కనిపిస్తుంది ఇది పురుషుల్లో ఉండే మూత్రశానికి కింద ఉన్న ప్రోస్టేట్ గ్రంధి ఈ గ్రంధి వాపు వల్ల మీకు మూత్రంలో మూత్రం పోసేటప్పుడు మంట, నొప్పి అనేది అనిపిస్తుంది.

మధుమేహం : మధుమేహం కూడా కారణం అవ్వచ్చు మీ శరీరంలో చక్కర శాతం ఎక్కువైనట్లయితే మూత్రనాళాల్లో ఇబ్బంది కలిగి ఈ సమస్యలను కలిగిస్తాయి

మందులు: ఎక్కువగా యాంటీబయోటిక్స్, పెయిన్ కిల్లర్స్ వాడినట్లయితే మీరు మూత్రం పోసేటప్పుడు మంట ,నొప్పి ఇన్ఫెక్షన్స్ వచ్చేఅవకాశాలు ఉన్నాయి.

ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం పొందాలంటే ఈ కొన్ని టిప్స్ 

నీరు త్రాగడం: శరీరానికి పుష్కలంగా నీరు అందించినట్లయితే ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. ఎక్కువ నీరు త్రాగడం ద్వారా మీ మూత్రణాళాన్ని శుభ్రపరుస్తుంది. దీని ద్వారా బ్యాక్టీరియా యూరిన్ ద్వారా బయటికి వచ్చేసి ఈ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.

ప్రోబ్లయాటిక్స్ : ప్రోబయాటిక్స్ లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది మూత్రనాలలో ఏర్పడిన ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బ్యాక్టీరియాను నియంత్రించడంలో ఈ ప్రోబయాటిక్స్ చాలా బాగా ఉపయోగపడి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రాకుండా చేస్తాయి.

మందులు: ఇబు ప్రోఫిన్, ఎసిటమైనఫిల్ వంటి నొప్పి నివారణ మందులు కూడా ఈ మూత్రంలో వచ్చేమంటని నొప్పిని తగ్గించడంలో ఉపయోగపడతాయి.

ఒకవేళ మీకు మూత్ర విసర్జన సమయంలో నొప్పి, మంట మరీ భరించలేనంతగా ఉన్నట్లయితే వెంటనే వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం. డాక్టర్ మీ లక్షణాలను అంచనా వేసి దానికి తగ్గట్టుగా మందులు ఇచ్చి ఆ సమస్య నుంచి బయటపడేలా చేస్తారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.