Health Tips: కండరాల నొప్పులతో బాధపడుతున్నారా..ఈ చిట్కాలతో మీ సమస్యకు చెక్.

కాళ్లు, చేతులు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా నొప్పులతో మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తాయి. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పడానికి జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటారు.

muscle pain

ఈరోజుల్లో కండరాల నొప్పులు సర్వసాధారణమైపోయింది. కాళ్లు, చేతులు శరీరంలో ఉన్న కండరాలన్నీ కూడా నొప్పులతో మొద్దుబారిపోయినట్లుగా అనిపిస్తాయి. దీని వెనక అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పడానికి జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య ఎదుర్కొంటారు. ముఖ్యంగా పోషకాహార లోపం, ఫాస్ట్ ఫుడ్ అధికంగా తీసుకోవడం, ఆయిల్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం, వల్ల ఈ లక్షణాలు ఎక్కువ అవుతాయి. అంతేకాకుండా చాలా మంది శారీరక శ్రమ చేయకుండా అధిక బరువు ఉన్నవారులో కూడా ఈ సమస్యలు తలెత్తుతాయి. అయితే కొన్ని చిట్కాలు ద్వారా మనం ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

వెల్లుల్లి ,పాలు: కాళ్ల నొప్పులు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడేవారు కొన్ని వెల్లుల్లి రెబ్బలను పాలలో మరిగించి వాటిని తీసుకోవడం ద్వారా ఈ సమస్య తగ్గిపోతుంది.

అల్లం, వెల్లుల్లి: మీరు తీసుకునే ఆహారంలో అల్లం ,వెల్లుల్లి ఎక్కువగా తీసుకుంటే మీకు బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ కూడా బయటకు పోయి కండరాల నొప్పులు అనేవి తగ్గుతాయి. అంతేకాకుండా ఎప్పుడు కూడా వేడి నీరు తీసుకోవడం ఉత్తమం. దీని ద్వారా కూడా మీ కండరాల నొప్పులు తగ్గిపోతాయి.

హాట్ ఆయిల్ మసాజ్: మీ శరీరంలో ఈ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వేడి నూనెతో మసాజ్ చేసుకున్నట్లయితే మీ కండరాల నొప్పులు తగ్గిపోతాయి. మీరు ఆలివ్ ఆయిల్ తో ,నువ్వుల నూనె, కొబ్బరి నూనెతో  మసాజ్ చేసుకుంటే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది.

Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి

వేడి నీటితో స్నానం: రక్త ప్రసన్న మెరుగుపరచుకోవడానికి వేడి నీటితో స్నానం చేయడం చాలా చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఇది కండరాలు నరాలను నొప్పులు తగ్గిస్తుంది. మీరు ఎక్కువగా నొప్పులు అనిపించినప్పుడు ఆ నీటిలో కాస్త ఉప్పు కూడా వేసుకొని స్నానం చేయడం వల్ల మీకు తీవ్ర ఉపశమనం.

పసుపు పాలు: పసుపులో యాంటీసెప్టిక్ గుణాలు అధికంగా ఉంటాయి. కాబట్టి మీరు పాలు తీసుకునేటప్పుడు దాంట్లో చిటికెడు పసుపు వేసుకొని ఇలా వారానికి రెండు సార్లు తాగితే మీ రక్తప్రసరణ సక్రమంగా జరిగి మీకు శరీరంలో ఉన్న వాపులను నొప్పులు తగ్గించడానికి చాలా బాగా సహకరిస్తుంది.

మీ కండరాల నొప్పులు తగ్గించుకోవడానికి ఆరోగ్యంలో కొన్ని మార్పులు చేసుకుంటే మంచిది. ముఖ్యంగా పోషకాహారాలు ఉన్న విటమిన్స్ బి, బి 6, పాలు, పెరుగు అరటిపళ్ళు మొదలైనవి తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.