Health Tips: సైనస్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారా,ఈ చిట్కాలతో సైనస్ సమస్యకు పరిష్కారం.

ముక్కు చెవులు, గొంతు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి.

Image used for representational purpose only | (Photo Credits: Pixabay)

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ,వాతావరణంలో మార్పులు, చల్లగాలుల వల్ల చాలామందిలో సైనస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముక్కు చెవులు, గొంతు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి. ఆస్తమా .సైనస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి ఈ సైనా ఈ చలికాలం చాలా ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే ఈ రోజుల్లో సైనస్ పేషెంట్ల సంఖ్య రోజురోజుకు పెరిగింది. కొన్ని రకాల హోమ్ రెమెడీస్ వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

సైనస్ అంటే ఏమిటి- సైనస్ మన ముక్కు చుట్టూ ఉండే గాలితో నిండి ఉన్న క్యావిటీస్ అని అంటారు. ఇవి మన శరీరాన్ని శ్వాస తీసుకోవడంలో ,ముఖ ఎముకలను బలోపేతం చేయడానికి తలను తేలికగా తిప్పడానికి సహాయపడతాయి. సైనస్లు సాధారణంగా శేషు ఉత్పత్తి చేస్తాయి. ఇది ముక్కును తేమగా ఉంచడానికి దుమ్ము, జెమ్స్ వంటి కణాలు బయటికి పంపడానికి సహాయపడుతుంది. కొన్ని కారణాలవల్ల సైనస్ లోపల వాపు లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. దీనినే సైనసైటిస్ అని అంటారు. సైనసైటిస్ వల్ల ముక్కు మూసుకుపోవడం, తలనొప్పి, కళ్ళ చుట్టూ ఒత్తిడి, ఎలర్జీ, ముక్కునొప్పి, కళ్ళు తిరగడం వంటి సమస్యలు వస్తాయి. ఇది ఎలర్జీ ,వైరస్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల ద్వారా ఈ సైనసైటి సమస్య సంభవిస్తుంది.

సైనస్ తగ్గించుకోవడానికి ఇంటి చిట్కాలు

వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫర్మేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియాను, వైరస్ ను నాశనం చేసే గుణాన్ని కలిగి ఉంటుంది. వెల్లుల్లి తీసుకున్నట్లయితే ఈ సైన సమస్య నుంచి బయటపడవచ్చు.

తులసిటీ- తులసిటీలో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్టీరియా, వైరస్లను చంపే గుణాన్ని కలిగి ఉంది. తులసిటీని ప్రతి రోజు తీసుకోవడం ద్వారా ముక్కు నొప్పి, తలనొప్పి, కంటి చుట్టూ నొప్పి అన్ని కూడా తగ్గుతాయి. అంతేకాకుండా గొంతు నొప్పి వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.

Health Tips: న్యూమోనియా సమస్యతో బాధపడుతున్నారా, దాని లక్షణాలు ...

ఆవిరి- సైనా సమస్యతో బాధపడే వారికి ఆవిరి తీసుకోవడం అనేది చాలా గొప్ప ఉపశమనాన్ని అందిస్తుంది. వేడి నీళ్లలో కొన్ని చుక్కల జండుబాం లేదా యూకలిప్టస్ ఆయిల్ లేదా పిప్పర్మెంట్ ఆయిల్ వేసి ఆవిరి పట్టడం ద్వారా నాసికా రంధ్రాలు తెరుచుకుంటాయి. అంతేకాకుండా వాపు తగ్గుతుంది.

విటమిన్ సి- పైన సమస్యతో బాధపడే వారికి ముఖ్యంగా రోగనిరోధక వ్యవస్థ కూడా బలహీనపడుతుంది. విటమిన్ సి అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా నారింజ, సిట్రస్, బెర్రీ, క్యాప్సికం వంటి ఆహార పదార్థాలను తీసుకున్నట్లయితే సైన సమస్య నుంచి బయటపడవచ్చు. సైలస్ నుండి బ్యాక్టీరియా తొలగిస్తుంది. అంతేకాకుండా పూజలు దగ్గు నొప్పి వంటి వాటిని రాకుండా చేస్తుంది.

పసుపు- పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేటర్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు ఆహారంలో పసుపును భాగం చేసుకున్నట్లయితే ఈ సైన సమస్య నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి