న్యూమోనియా అనేది ఒక తీవ్రమైన వ్యాధిగా చెప్పవచ్చు. కలిగించే ఒక శ్వాస వ్యాధి ఇది ఇన్ఫెక్షన్ ద్వారా తరచూ వైరస్ ,ఫంగస్ ద్వారా వస్తుంది. ఇది అన్ని వయసుల వారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల్లో వృద్ధులలో బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది.
న్యూమోనియా అంటే ఏమిటి.
న్యూమోనియా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో ద్రవము లేదా చీము ఏర్పడడానికి న్యూమోనియా అంటారు. దీని వల్ల మన శరీరానికి సరిపడా ఆక్సిజన్ అందక శ్వాసక్రియలో సమస్యలు ఏర్పడతాయి. అనేక సందర్భాల్లో కొంతమంది తొందరగా కోలుకుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రం అవుతుంది. అటువంటివారు ఆసుపత్రిలో చేరాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఇది పిల్లల పెద్దల వారికి తీవ్రమైన ఆరోగ్యం ఒప్పుగా చెప్పవచ్చు.
న్యూమోనియా లక్షణాలు.
న్యూమోనియా ప్రారంభ లక్షణాలుగా దగ్గు ,జలుబు వంటి వాటితో ప్రారంభమవుతుంది. ముఖ్యంగా దగ్గులో తెమడ రావడం అనేది కనిపిస్తుంది. కాలక్రమమైన ఇది తీవ్రం అవుతుంది. ఒక్కొక్కసారి అధిక జ్వరం చెమటలు పట్టడం వంటివి కూడా కనిపిస్తాయి. అంతేకాకుండా శ్వాస ఆడక పోవడం ప్రధాన లక్షణంగా చెప్పవచ్చు. ఊపిరితిత్తులు న్యూమోనియా వచ్చినప్పుడు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది ఎదురవుతుంది. అంతేకాకుండా తగినంత ఆక్సిజన్ మన శరీరానికి అందదు శ్వాస ఆడక పోవడానికి కూడా కారణం అవుతుంది. దగ్గు విపరీతంగా వస్తుంది చాతిలో నొప్పి కూడా ఎక్కువ అవుతుంది. న్యూమోనియా సమయంలో అలసట నీరసము బలహీనత కూడా ఏర్పడతాయి. శరీరంలో శక్తి తగ్గడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఆకలి లేకపోవడం తీవ్రమైన జ్వరము, రక్తంతో కూడిన దగ్గు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటే లక్షణాలు ఏమైనా కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం చాలా ముఖ్యం.
Health Tips: మీ శరీరంలో ఈ ఐదు సంకేతాలు కనిపిస్తున్నాయా
న్యూమోనియా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.
టీకా. న్యూమోనియా రాకుండా ఉండడానికి పిల్లలు వృద్దులలో టీకాలు వేయించుకోవడం చాలా ముఖ్యం. pcv వంటి టీకాలు శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్తో పోరాడి మన శరీరాన్ని బలపరుస్తాయి. ఇది తీవ్రమైన వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి లేని వ్యక్తుల్లో దీన్ని తగ్గించుకోవడం కోసం టీకాలు వేయించుకోవడం ఉత్తమం.
ఆరోగ్యకరమైన జీవనశైలి- న్యూమోనియా రాకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన జీవనశల్ని అవలంబించుకోవడం ముఖ్యం. ఇందులో పోషకాల అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి నిద్ర తగినంతగా తీసుకోవాలి. తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఇది శరీరాన్ని అంటువ్యాధులతో పోరాడడానికి న్యూమోనియా వంటి వ్యాధులు రాకుండా ఉండడానికి సహాయపడుతుంది.
న్యూమోనియా వ్యక్తుల నుండి దూరంగా ఉండడం- ఫ్లూ అంటువ్యాధులతో బాధపడుతున్న వ్యక్తుల నుండి దూరంగా ఉండడం వల్ల న్యూమోనియా ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇన్ఫెక్షన్స్ సోకిన వ్యక్తులతో ఈ సమస్య త్వరగా వ్యాపిస్తుంది. కాబట్టి వీరికి దూరంగా ఉండటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి