best health tips for reduce belly fat, simple tips for decrease belly fat(X0

ఈరోజుల్లో చాలామందిలో ఎక్కువగా కనిపించే సమస్య కొలెస్ట్రాల్ జీవనశైలి, ఆహారపాలవాట్ల వల్ల కొలెస్ట్రాల్ సమస్య రోజురోజుకు పెరిగిపోతుంది. ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె సంబంధ వ్యాధులు, గుండెపోటు, గుండె ఆగిపోవడం వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతేకాకుండా కొలెస్ట్రాల్ పెరగడం వల్ల బిపి, షుగర్ వంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే మీ శరీరంలో గనక ఇటువంటి లక్షణాలు కనిపిస్తే మీకు కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం . నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యున్ని సంప్రదించడం ఉత్తమం.

శరీరంలో కనిపించే ఐదు సంకేతాలు- కాళ్లలో తిమ్మిర్లు ,నొప్పి..

మీకు కాళ్లలో తిమ్మిర్లు, వాపు, నొప్పి వంటివి పెరగడం అనేది కొలెస్ట్రాల్ సంకేతం చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తప్రసరణలో ప్రభావితం చేస్తుంది. కాబట్టి దీని వల్ల కాళ్లలో నొప్పి పెరుగుతుంది. మీరు ప్రతి రోజు ఈ సమస్యను ఎదుర్కొన్నట్లయితే ఒకసారి కొలెస్ట్రాల్ పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది- అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. ఇలా మీకు అనిపించినట్లయితే అది కొలెస్ట్రాల్ పెరిగినట్లుగా సంకేతం. మీరు ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ ను తీసుకున్నప్పటికీ తీసుకున్నప్పటికీ కూడా ఈ సమస్య సంభవిస్తుంటే మీరు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యులను సంప్రదించాలి.

Health Tips: మీరు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..

చమటలు పట్టడం- కొంతమందిలో ఊరుకే చెమటలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా రాత్రిపూట తిన్న తర్వాత కొన్ని సార్లు అకస్మాత్తుగా చెమటలు పడతాయి. ఇది కొలెస్ట్రాల్ పెరుగుదలకు సంకేతము వీరు ఏసి ఫ్యాన్ గాలి ఉన్నప్పటికీ కూడా చెమటలు పడుతున్నట్లయితే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.

నిద్రలేమి- మీరు పడుకున్నప్పటికీ కూడా గంటలు తరబడి నిద్ర రాకపోవడం కూడా ఇది అధిక కొలెస్ట్రాల్ కి హెచ్చరికగా చెప్పవచ్చు. పెరిగిన కొలెస్ట్రాల్ కారణంగా మీ మెదడుకు ఆక్సిజన్ సరఫరా సరిగా అందదు. దీని కారణంగా నిద్రపోవడమనేది చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఇటువంటి సమస్యను గనుక మీరు ఎదుర్కొంటున్నట్లయితే వెంటనే వైద్యుల్ని సంప్రదించడం ఉత్తమం.

 కొలెస్ట్రాళ్లు తగ్గించడానికి మార్గాలు.

ప్రతిరోజు వ్యాయామము చేయడం రోజుకు తగినంత నీరు మన శరీరానికి అందించడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ సమస్య నుంచి బయటపడవచ్చు. మీరు ప్రతిరోజు భోజనంలో ఒక సలాడ్ని చేర్చుకోవడం కూడా ఉత్తమం. ఎప్పుడు కూడా బరువు పెరగకుండా సమతుల్య ఆహారం తీసుకోవడం మంచిది. మీరు తీసుకునే ఆహారాల్లో ఎక్కువగా కాయగూరలు పండ్లు ఉండేలా చూసుకోవాలి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి