file

మన శరీరానికి కేవలం విటమిన్లు మినరల్స్, పోషకాలతో పాటు ప్రోటీన్ కూడా చాలా ముఖ్యం. ప్రోటీన్ లోపం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలసట, బలహీనత, జుట్టు రాలిపోవడం, అధికంగా ఆకలి వేయడం, పొడి చర్మం ఏర్పడం వంటి లక్షణాలు మన శరీరం పైన కనిపిస్తాయి. అయితే శాఖాహారులో మాత్రం ఎక్కువగా ఈ ప్రోటీన్ లోపం సమస్య కనిపిస్తుంది. వీరు నాన్ వెజ్ తినరు కాబట్టి నాన్ వెజ్ లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. అయితే మీరు మీ ఆహారంలో టోఫోను యాడ్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా ప్రోటీన్ లోపం నుంచి బయటపడవచ్చు.

టోపు అంటే ఏమిటి- టోఫును సోయా పాల నుండి తయారుచేస్తారు. ఇది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటుంది. వీటిని ఆయుర్వేదంలో పంచకర్మ సెంటర్లో కూడా తోపును వినియోగిస్తూ ఉంటారు. తోఫోన్ ఉపయోగించడం ద్వారా ప్రోటీన్ లో పని తగ్గించుకోవచ్చు.

టోఫులో ఉండే పోషకాలు- 100 గ్రాముల టోఫులో పది గ్రాముల ప్రోటీన్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా 100 గ్రాముల టోఫులో 55 క్యాలరీలు మాత్రమే ఉంటుంది. టోఫులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ క్యాల్షియం, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

Health Tips: ఈ జబ్బులతో బాధపడేవారు, వేడి నీటిని అస్సలు తాగకూడదు.

టోఫు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు- టోఫునో క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మనకు గుండెకు చాలా మంచిదని డాక్టర్లు చెప్తున్నారు. ఇది ధమనులను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఎక్కువ కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి పరిష్కారంగా చెప్పవచ్చు. క్యాన్సర్ వంటి ప్రాణాంతక రోగాలలో కూడా తోపులు ఒక ప్రయోజన కార్య ఉపయోగిస్తూ ఉంటారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారిస్తుంది. టోపం తీసుకోవడం వల్ల బరువు కూడా తగ్గుతారు. ఇందులో కేలరీలు చాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి అధిక ప్రోటీన్ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడానికి ఇది చక్కటి ఎంపికగా చెప్పవచ్చు.

టోఫులో కాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి చాలా మంచిది కండరాల పెరుగుదలకు ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. తోపును ప్రతిరోజు తీసుకోవడం వల్ల జీత వ్యవస్థ మెరుగుపడుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది.  అనేక రకాల కడుపు సంబంధ సమస్యలు తగ్గుతాయి. ఇందులో ఉండే పోషకాలు మెదడు పనితీరును ఉత్తేజపరుస్తంలో సహాయపడుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి