Health Tips: పచ్చిపాలు తాగుతున్నారా అయితే అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి జాగ్రత్త.
పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అయితే పచ్చిపాలు తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
చాలామందికి పచ్చిపాలు తాగే అలవాటు ఉంటుంది. పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అంటారు. అయితే పచ్చిపాలు తాగడం ద్వారా కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే పాలలో ప్రోటీన్, క్యాల్షియం ,విటమిన్ ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి అయితే పచ్చిపాలు తీసుకోవడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏమిటో తెలుసుకుందాం.
ఇన్ఫెక్షన్స్- పచ్చి పాలలో ఇంట్లో ఎంత వైరస్ ఉంటుంది. ఇది అనేక రకాల ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది పచ్చిపాలలో ఈకోలై సాల్మొనెల్ల వంటి బ్యాక్టీరియాల్ కూడా ఉంటాయి. పచ్చిపాలన తాగడం ద్వారా కొంతమందిలో కడుపునొప్పి, విరోచనాలు, వాంతులు వంటి సమస్యలు తలెత్తుతాయి.
ఎవరు తాగకూడదు- పచ్చిపాలను సాధారణంగా పిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, బలహీనమైన రోగ నిరోధక శక్తి ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాగకూడదు. దీనివల్ల వీరికి రోగనిరోధక వ్యవస్థ ఇంకా బలహీనపడుతుంది. ఏదైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లకు కూడా వీరు సులభంగా ఇబ్బంది పడతారు. ఇందులో వైరస్, బ్యాక్టీరియాలు అధికంగా ఉండడం ద్వారా తీవ్రమైన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో ...
పాశ్చరైజేషన్ చేయాలి- పాశ్చరైజేషన్ అనేది ఒక ప్రక్రియ. ఇది పాలల్లో ఉండే హానికరమైన వైరస్లను, బ్యాక్టీరియాలను నాశనం చేయడానికి గది ఉష్ణోగ్రత వద్ద పాలను వేడి చేస్తారు. దీని వల్ల బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు రావు అంతేకాకుండా అతిసారం ,వాంతులు క,డుపునొప్పి వంటి ఇన్ఫెక్షన్ల వంటి సమస్యలను రాకుండా చేస్తుంది. పాశ్చరైజేషన్ చేయడం ద్వారా ఇటువంటి బ్యాక్టీరియాలు మన శరీరంలోనికి ప్రవేశించవు. పాశ్చరైజేషన్ లేకుండా పాలను తాగినట్లయితే అనేక రకాల జబ్బులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి.
పచ్చి పాలు తాగడం వల్ల నష్టాలు.
పాలను వేడి చేయకుండా పచ్చి పాలను తాగడం ద్వారా జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు గురవుతుంది. ముఖ్యంగా కడుపుబ్బరం ,వాంతులు, విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఇది పెద్దల్లో కంటే పిల్లల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా డయేరియా డీహైడ్రేషన్ వంటి వాటికి కారణం అవుతుంది. ముఖ్యంగా ఇందులో వైరస్ ఎక్కువ కాలం పాటు ఉంటుంది. దీని ద్వారా ఫ్లూస్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి