Tea (Photo-Pixabay)

చాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. టి అధికంగా తీసుకోవడం వల్ల కలిగే సమస్యలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఎసిడిటీ- టీ ని రోజులో అధికంగా తాగే వారిలో ఎసిడిటీ సమస్య ఎక్కువగా ఉంటుంది. యాసిడ్ రిఫ్లెక్షన్ సమస్యలు పెరుగుతూ ఉంటాయి. టి కడుపులోని ఆసిడ్ బ్యాలెన్స్ ను చెడగొడుతుంది. దీనివల్ల ఈ సమస్య మరింత క్షీణిస్తుంది. టీ లో ఉండే కెఫెన్ ఆసిడ్ స్థాయిని పెంచుతుంది. కాబట్టి దీని అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉన్న పీహెచ్ బ్యాలెన్స్ లో సమతుల్యత లోపిస్తుంది. దీనివల్ల అజీర్ణం గుండెల్లో మంట వంటివి ఏర్పడతాయి.

Health Tips: ముల్లంగిని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ...

రక్తహీనత- టి అధికంగా తీసుకునే వారిలో రక్తహీనత సమస్య అధికంగా ఉంటుంది. టీ లో ఉండే ఫినాలేక్ రసాయనం కారణంగా ఐరన్ ని అభివృద్ధి చెందనీయదు. ఇది ఐరన్ సోషల్ను నిరోధిస్తుంది. కాబట్టి మీరు టీ ని అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీకు అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

పోషకాలు అందవు- టీ లో ఉండే టానిన్లు శరీరంలో ఉన్న పోషకాల సోషన నిరోధిస్తాయి. ఇది ఆంటీ న్యూట్రియంట్ గా పనిచేస్తుంది. కాబట్టి ఈ టానిన్లు జీర్ణ క్రియను 40 శాతం వరకు మందగించేలా చేస్తాయి. మీరు ఏ పోషకాలు తీసుకున్న టీ తీసుకోవడం ద్వారా అది శరీరం సరిగా ఉపయోగించుకోలేదు. దీని ద్వారా పోషకాలు మీ శరీరంలో లోపం ఏర్పడుతుంది.

నష్టాలు- దీని అధికంగా తీసుకోవడం వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. ముఖ్యంగా దంతాలు ఊడిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దంతాలు పసుపు రంగులోకి మారుతాయి. అంతేకాకుండా శరీరం డిహైడ్రేషన్ కి గురవుతుంది. పెరుగుతాయి జీర్ణాశయంలో ఇబ్బందులు ఏర్పడతాయి. నిద్రకూడా ఇబ్బంది కలుగుతుంది అలసట నీరసం వంటివి ఏర్పడతాయి.

రోజులు కనీసం రెండుసార్లు నుంచి మూడుసార్లు తాగితే పర్వాలేదు అలా కాకుండా అంతకంటే ఎక్కువసార్లు టీ తాగినట్లయితే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి