Health Tips: ఉదయం నిద్ర లేవగానే వికారంగా అనిపిస్తుందా.. అయితే ఈ మూడు వ్యాధుల ప్రారంభ సంకేతాలు కావచ్చు.

మరి కొంత మంది అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అప్పుడప్పుడు జరిగితే ఇది మామూలే కానీ ప్రతిరోజు ఇలా జరగడం కొన్ని రకాలైన జబ్బులు రావడానికి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు.

చాలామంది ఉదయం పూట నిద్రలేచిన వెంటనే వికారంగా అనిపించి వాంతులు చేసుకుంటారు. మరి కొంత మంది అప్పుడప్పుడు ఇలాంటి సమస్యలు ఏర్పడతాయి. అయితే అప్పుడప్పుడు జరిగితే ఇది మామూలే కానీ ప్రతిరోజు ఇలా జరగడం కొన్ని రకాలైన జబ్బులు రావడానికి ప్రారంభ సంకేతాలుగా చెప్పవచ్చు. ఉదయం పూట వార్తలు చేసుకోవడమనేది ఏ కారణాల వల్ల వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

లో షుగర్- ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండడంవల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిపోతాయి. రక్తంలో చక్కెర స్థాయి తగ్గడం వల్ల వికారంగా కళ్ళు తిరగడం వాంతులు అవుతాయి. దీనినే హైపోగ్లసిమియా అని కూడా అంటారు. దీన్ని తగ్గించుకోవడం కోసం మీరు వ్యాయామం చేయడం వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడం  ద్వారా ఈ సమస్య తగ్గుతుంది.

Health Tips:పేగుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా

గ్యాస్ ప్రాబ్లం- అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య కడుపుబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు కూడా ఉదయాన్నే లేచిన వెంటనే వాంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఖాళీ కడుపుతో ఈ సమస్య మరి పెరుగుతుంది. కాబట్టి వీరికి ఉదయాన్నే ఎక్కువ సమయం ఖాళీ కడుపుతో ఉండకుండా అల్పాహారం తీసుకోవడం ఉత్తమం. అంతేకాకుండా తగినన్ని నీళ్లు తీసుకోవడం కూడా మంచిది. రాత్రిపూట భోజనం చేసేటప్పుడు గ్యాస్ ను కలిగించే ఆహార పదార్థాలను మానివేస్తే ఈ సమస్య రాకుండా ఉంటుంది.

మైగ్రేన్- తలనొప్పి ,మైగ్రేన్ సమస్యలతో బాధపడే వారికి ఉదయం లేచిన వెంటనే వికారంగా అనిపిస్తుంది. ఆందోళన, నిరాశ, ఒత్తిడి వంటి సమస్యతో బాధపడే వారికి కూడా ఉదయాన్నే వికారంగా అనిపించి వాంతులు చేసే అవకాశాలు ఉంటాయి. ఇవే కాకుండా డిహైడ్రేషన్, నిద్ర లేకపోవడం, అధికంగా తినడం వల్ల కూడా ఉదయం లేచిన వెంటనే వాంతులు అయ్యే అవకాశాలు ఉంటాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి. 



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif