(Photo Credits: Pixabay)

మన మొత్తం ఆరోగ్యానికి పేగులు చాలా ముఖ్యమైనవి. మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి ఈ ప్రేగులు ఉపయోగపడతాయి. ఒకవేళ వీటిలో ఇన్ఫెక్షన్ ఏర్పడడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి. కొన్నిసార్లు సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం ద్వారా మన పేగులు ఇన్ఫెక్షన్ కి గురవుతాయి . అయితే ఏ ఆహార పదార్థాలు దూరంగా ఉంటే వాటిని నివారించవచ్చు తెలుసుకుందాం.

ఫాస్ట్ ఫుడ్స్:  ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను తరచుగా అధిక మొత్తంలో తీసుకుంటే మీ జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావం చూపి పేగుల్లో ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది. ఇందులో అధిక శాతం చక్కెర ,సోడియం కలిగి ఉండడం ద్వారా మీ జీర్ణ వ్యవస్థ పైన తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది, పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ,ప్యాకెట్స్ స్నాక్స్ వంటి వాటికి దూరంగా ఉంటే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

చక్కెర ఉత్పత్తులు: అధిక మొత్తంలో చక్కెర తీసుకోవడం ద్వారా మన పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఇన్ బాలన్స్ అవుతుంది. దీని ద్వారా మన పేగులు ఇన్ఫెక్షన్ కి కారణం అవుతుంది. అందుకే సరిగ్గా జీర్ణం కాక తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా కూల్డ్రింక్స్ ,క్యాండీలు ,కేకులు వంటి వాటికీ దూరంగా ఉండడం మంచిది.

రెడ్ మీట్: రెడ్ మీట్ జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. దీనివల్ల పేగుల్లో బ్యాక్టీరియా పెరుగుతుంది. దీని ద్వారా పేగులు ఇన్ఫెక్షన్ కి గురవుతాయి.

Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు

ఎక్కువ కొవ్వు ఉన్న పదార్థాలు: అధిక కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన జీవ సమస్యలు ఎక్కువ అవుతాయి. దీని ద్వారా ఇవి చాలా కాలం పాటు మనం ఇబ్బందులకు గురిచేస్తాయి. దీని ద్వారా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ముఖ్యంగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, అధిక కొవ్వు ఉన్న పాల ఉత్పత్తులు వీటి ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి వీటికి దూరంగా ఉంటే మంచిది.

సోడియం అధికంగా ఉండే ఆహారాలు: సోడియం అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మన పేగుల్లో ఇబ్బందులు కలిగిస్తాయి. మన జీర్ణ క్రియను ప్రభావితం చేస్తాయి. ఉప్పుగా ఉండే చిప్స్ ,స్నాక్స్ ,ప్రాసెస్ చేసిన మీట్ వంటి వాటికీ దూరంగా ఉండాలి. ఇవి మన పేగులను ఇన్ఫెక్షన్ కి గురి చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

పేగులకు ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి.

ఫైబర్ అధికంగా ఉన్నపండ్లు, కూరగాయలు ,స్ప్రౌట్స్ అధిక మొత్తంలో తీసుకుంటే మన జీర్ణక్రియకు సహాయపడుతుంది. మన మెట్టబడెను పెంచుతుంది. మన పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంతేకాకుండా తగినంత నీరు తీసుకోవడం వల్ల కూడా ప్రేగులు ఇన్ఫెక్షన్ నుండి బయటపడతాయి. అంతేకాకుండా ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది. ప్రోబయోటిక్స్ ఎక్కువగా తీసుకోవాలి. పెరుగు మజ్జిగ లాంటి వాటిని ఆహారంలో భాగం చేసుకుంటే మీ పేగుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది. దీని ద్వారా మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఈ పద్ధతులు ఉపయోగించి పేగుల ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు. మన జీర్ణ వ్యవస్థను కాపాడుకోవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.