ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. మన శరీరంలో మెదడు లో రక్తస్రావం కారణంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మాట తడబడడం: స్ట్రోక్ వచ్చే ముందు అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే అకస్మాత్తుగా సరిగ్గా మాట్లాడలేడు. మాటలు తడబడుతూ ఉంటాయి. అయోమయంలో ఉంటాడు కాబట్టి మనము ఇది బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే సంకేతంగా గుర్తించవచ్చు.
ముఖము ,కాళ్లు చేతుల్లో తిమ్మిరి: బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి ముందు కాళ్లు మొహం చేతుల్లో విపరీతమైన తిమ్మిరి వచ్చి బలహీనం పడతారు. చేతులు రెండు కిందికి పడిపోతాయి. ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ కి సంకేతం కావచ్చు..
వాంతులు: అకస్మాత్తుగా వాంతులు తలనొప్పి కళ్ళు తిరగడం వంటివి కూడా బ్రెయిన్ స్ట్రోక్ కి ప్రారంభ సంకేతంగా గుర్తించవచ్చు.
Health Tips: మీ పేగులను శుద్దిచేసే డీటాక్స్ డ్రింక్.
నడుస్తూ పడిపోవడం: బ్రెయిన్ స్ట్రోక్ కి సంకేతం ఒక వ్యక్తి నడుస్తూ నడుస్తూ పడిపోవడం. నడవడానికి ఇబ్బంది పడడం అకస్మాత్తుగా చెమటలు రావడం ఇది కూడా బ్రెయిన్ స్ట్రోక్ కి కారణం కావచ్చు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.