juice

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటాం. ఆ కలుషిత ఆహారాన్ని బయటకు పంపించే ఒక డీటాక్స్ డ్రింక్ గురించి ఈరోజు తెలుసుకుందాం. అది మన ప్రేగులోని శుభ్రపరిచి ఎటువంటి జబ్బులు రానీయకుండా మన జీర్ణ వ్యవస్థను అదే విధంగా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది.

ఈరోజుల్లో చాలామంది జీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు. మన ఆరోగ్యం ఎంత ముఖ్యమో మన శరీరంలో ఉన్న జీర్ణ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. మనం తీసుకున్న ఆహార పదార్థాలు సరిగ్గా జీర్ణం కాకపోతే మన ఆరోగ్యం క్షీణిస్తుంది. దాని కారణంగా అల్సర్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రేగుల్లో వాపు వంటి సమస్యలు సంభవించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మన ప్రేగులను జాగ్రత్తగా చూసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దీనికోసం సహజసిద్ధంగానే మనము ఇంట్లోనే డీటాక్స్ డ్రింక్ ను తయారు చేసుకోవచ్చు. ఈ డీటాక్స్ డ్రింక్ ద్వారా మన పేగులు శుభ్రం అవుతాయి. దీని ద్వారా మన శరీరంలో మలినాలన్నీ కూడా బయటికి పోతాయి. ఆ డీటాక్స్ డ్రింక్ కు కావలసిన పదార్థాలు ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు.బీట్రూట్, క్యారెట్, లెమన్, మిరియాలు, అల్లం

తయారీ విధానం.ముందుగా ఒక క్యారెట్ ను ఒక బీట్రూట్ ను అల్లం చిన్న కొమ్మును శుభ్రంగా తొక్క తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ మూడింటిని కూడా మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అందులో కొంచెం పసుపు వేసుకుని గ్రైండ్  చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని వాటర్ పోసుకొని అందులో నిమ్మకాయ పిండుకున్నట్లయితే ఈ డీటాప్స్ డ్రింక్ రెడీ అయినట్లే.

Health Tips: భోజనం చేసిన తర్వాత ఎన్ని గంటలకు మాత్ర వేసుకోవాలి,

ఈ డీటెక్స్ డ్రింక్ ఆరోగ్య ప్రయోజనాలు. క్యారెట్ ,బీట్రూట్ లలో విటమిన్ ఏ, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది మీ కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచి మీ శరీరంలో ఉన్న వ్యర్ధపదార్థాలన్నింటికీ బయటకు పంపడానికి ఈ క్యారెట్ బీట్రూట్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరు రక్తహీనతో బాధపడుతున్నట్లయితే కూడా మీ రక్తాన్ని వృద్ధి చేయడానికి ఈ క్యారెట్, బీట్రూట్ బాగా ఉపయోగపడతాయి.

నిమ్మకాయ నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పెంచి మన శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థాలను బయటికి పంపడానికి ఉపయోగపడుతుంది.

అల్లం: అల్లం లో యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఇన్ఫర్మేషన్ గుణాలు అధికంగా ఉంటాయి. ఇది పేగుల్లో వాపుకి తర్వాత గ్యాస్ ట్రబుల్ కి అల్సర్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.

పసుపు: పసుపులో యాంటీసెప్టిక్గా యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కలిగి ఉంది. మనకు ప్రేగుల్లో ఏర్పడిన పేగుప్తులను తగ్గించడానికి ఈ పసుపు అనేది సహకరిస్తుంది.

తిసుకునే విధానం: ప్రతిరోజు ఉదయం పరగడుపున ఒక గ్లాసు ఈ డీటాక్స్ డ్రింక్ ని తీసుకున్నట్లయితే మీ శరీరంలో ఉన్న వ్యర్ధాలను బయటకు పంపించడానికి ఈ డి టాప్స్ డ్రింక్ అనేది చాలా సహకరిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.