Health Tips: పిల్లలకు ఎక్కువగా బిస్కెట్లు ఇస్తున్నారా.. అయితే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం

దీన్ని వారి ఇష్టంగా తిన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.

చిన్నపిల్లలు ఏడ్చినప్పుడు లేదా వారికి ఆకలిగా అనిపించినప్పుడు ప్రతి తల్లిదండ్రులు చేసే పని బిస్కెట్లు ఇస్తూ ఉంటారు. దీన్ని వారి ఇష్టంగా తిన్నప్పటికీ కూడా అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి. అధికంగా బిస్కెట్లు తీసుకోవడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఆ అనారోగ్య సమస్యలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

అధిక బరువు- ఎక్కువగా బిస్కెట్లు తినే పిల్లలను అధిక బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీటిలో ఉండే హానికరమైన ఫ్యాక్స్ అధిక సోడియం ,చక్కెర వల్ల పిల్లల ఆరోగ్యానికి హానిచేస్తాయి. వీటిని అధికంగా తీసుకోవడం ద్వారా వీళ్ళు క్యాలరీలు పెరుగుతాయి. దీని ద్వారా బరువు గణనీయంగా పెరుగుతారు. దీంతో పాటు ఎక్కువగా తింటే పిల్లలకు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

Health Tips: బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా.

మలబద్ధకం- బిస్కెట్ల తయారీలో ఉపయోగించే పిండి వల్ల మలబద్ధకం సమస్య ఎక్కువగా వస్తుంది. వీటిలో మైదా పిండిని ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం ప్రాసెస్ చేసిన ఈ పిండి వల్ల పిల్లలకు జీర్ణక్రియ మందగిస్తుంది. దీని ద్వారా వీరు మలబద్ధకం సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది.

జీర్ణ సమస్యలు- బిస్కెట్లలో ప్రాసెస్ చేసిన పిండిని ,ఫుడ్ కలర్స్ ను, సోడియం కొవ్వు పదార్థాలను ఉపయోగించే తయారు చేస్తారు. వీటిని తీసుకోవడం ద్వారా పిల్లల ఆరోగ్యం పైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయి. వీటిని తినడం ద్వారా ఒక్కొక్కసారి పిల్లల కోసం సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా కడుపునొప్పి, వాంతులు, వంటి సమస్యలు ఏర్పడతాయి. అంతే కాకుండా బిస్కెట్లు ఎక్కువగా తినడం వల్ల కూడా పిల్లలకు దంత సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif