Bacteria | Image used for representational purpose (Photo Credits: Pixabay)

మన శరీరాన్ని రక్షించడంలో రక్తం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఇది పోషకాలను ఆక్సిజన్ ను మన శరీరంలోని అన్ని అవయవాలకు పంపించడానికి రక్తం సహాయపడుతుంది. అయితే రక్తం మన శరీర భాగాలకు ఆక్సిజన్ అందించడం కాకుండా శరీర ఉష్ణోగ్రతను కూడా నియంత్రించేలా చేస్తుంది. కొన్నిసార్లు మన రక్తము ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతుంది. హానికర పదార్థాలు తీసుకోవడం ద్వారా మన అభిమాన రక్తంలోకి చేరుతాయి. దీన్నే బ్లడ్ పాయిజనింగ్ అని అంటారు. రక్తంలో ఇన్ఫెక్షన్ వల్ల అనేక రకాల చర్మవ్యాధులు రావడం, మచ్చలు, మొటిమలు రావడం, బరువు తగ్గడం, పొట్టకు సంబంధించిన సమస్యలు రావడం ,నీరసం రావడము వంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే కొన్ని ఆహార పదార్థాల ద్వారా మన రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు- పసుపును యాంటీబయోటిక్ గా లక్షణాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా పసుపులో కర్కుమిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలో పేర్కొన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి సహాయపడుతుంది. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం ద్వారా ఇది కొన్ని రకాలైనటువంటి ఎన్జీవోలు ఉత్పత్తి చేసే మన రక్తాన్ని శుద్ధి చేస్తుంది. పసుపు తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది.

బీట్రూట్- చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడతారు. అటువంటి వారికి రక్తాన్ని పెంచడానికి బీట్రూట్ సరైన మార్గం. బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తం పెరగడమే కాకుండా మన రక్త శుద్ధి కూడా అవుతుంది. బీట్రూట్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొత్త రక్త కణాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. ఇది రక్తంలో ఉన్న మలినాలను బయటికి పంపించి కాలయాన్ని గుండెను కాపాడడంలో సహాయపడుతుంది.

వెల్లుల్లి- వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తాన్ని శుభ్రపరచడానికి ఒక సహజమైన నివారణగా చెప్పుకోవచ్చు. వెల్లుల్లిలో అల్లిసిన్ సల్ఫర్ కలిగి ఉంటుంది. రక్తాన్ని శుభ్రపరుస్తుంది. ఇందులో యాంటీ మైక్రోబియన్ లక్షణాలు అధికంగా ఉండడం ద్వారా మన ప్రేగుల్లో పేర్కొన్న బ్యాక్టీరియాలను వైరస్లను చంపుతుంది. వెల్లుల్లిని తీసుకోవడం ద్వారా మన రక్తం కూడా శుద్ధి అవుతుంది.

Health Tips: టమాటాను ఈ జబ్బులు ఉన్నవారు అస్సలు తీసుకోకూడదు.

తులసి- తులసిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ,యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంలో సహాయపడుతుంది. మన మూత్రపిండాలల్లో ఏర్పడిన మలినాలను బయటకు పంపిస్తుంది. మీరు ప్రతిరోజు నాలుగు తులసకుల్ని తీసుకున్నట్లయితే రక్త శుద్ధి జరుగుతుంది కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది.

నిమ్మకాయ-  ఇందులో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్ లో పుష్కలంగా ఉంటాయి. నిమ్మరసం తీసుకోవడం ద్వారా మన రక్తం కూడా శుద్ధి అవుతుంది. ఇది రక్తంలోని పీహెచ్ లెవెల్ ను స్థిరంగా ఉంచుతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.