టమాటాను ప్రతిరోజు మనము ఆహారంలో వాడుకుంటూ ఉంటాం. టమాటాలో ఫైబర్, విటమిన్ సి, పొటాషియం, విటమిన్ కె, ఫోలేట్ లాంటి ఉంటాయి. టమాటాలు మన ఆరోగ్యానికి అంత ప్రభావాన్ని చూపకపోయినా కొన్నిసార్లు కొన్ని జబ్బులో ఉన్నవారికి అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఏ జబ్బులు ఉన్నవాళ్లు టమాటాను తక్కువ తీసుకోవాలో తెలుసుకుందాం.
అల్సర్ సమస్య ఉన్నవాళ్లు- కడుపులో అల్సర్స్ ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా టమాటాలను ఎక్కువగా వాడకూడదు. ఇది ఈ సమస్యను ఎక్కువ చేస్తుంది. దీంట్లో ఎసిడికి నేచర్ ఎక్కువగా ఉండడం ద్వారా అల్సర్ తీవ్రమైన నొప్పి నొప్పిని పెంచుతుంది. కాబట్టి అల్సస్ ఉన్నవాళ్లు టమాటాలను సాధ్యమైనంత వరకు తక్కువగా వాడితే మంచిది.
Health Tips: షుగర్ వ్యాధి తో బాధపడుతున్నారా
కిడ్నీ స్టోన్స్- కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు టమాటాను వాడకుండా ఉంటే ఉత్తమం. టమాటాలో ఎక్కువ మొత్తంలో ఆక్సలైట్స్ ఉంటాయి. ఈ ఆక్సిలేట్లు మన శరీరంలోని కాల్షియంతో కలిసి క్యాల్షియం ఆక్సిలేట్ అనేటువంటి గట్టి పదార్థాన్ని ఏర్పరుస్తాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడానికి కారణం అవుతాయి. కాబట్టి కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ టమాటాలకు దూరంగా ఉంటే మంచిది.
ఎలర్జీ ఉన్నవాళ్లు- కొంతమందికి చర్మ సమస్యలు దద్దుర్లు వాపు శ్వాస తీసుకోవడం వల్ల ఇబ్బంది ఉన్నవారు ఈ టమాటాలకు దూరంగా ఉంటే మంచిది. ఎలర్జీ ఉన్నవాళ్లు టమాటాను ఎక్కువగా వినియోగిస్తే ఈ సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
ఆర్థరైటిస్ రోగులు- టమాటాలో సోలా నిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మన శరీరంలోని నొప్పులకు వాపు కు కారణం అవుతుంది. ఆర్థరైటిస్ జబ్బులు ఉన్నవాళ్ళకు ఈ టమాటాలకు దూరంగా ఉంటే ఈ సమస్య నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.