Health Tips: ఉదయాన్నే నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి.

chia seeds

ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో నానబెట్టిన చియా సీడ్స్ తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది .అంతేకాకుండా ఈ చియాసిడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైన పోషకాలు కూడా లభిస్తాయి. తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మానసిక సమస్యల నుండి కూడా బయటపడతారు. ఇందులో ఉండే విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్సు పుష్కలంగా ఉండడం ద్వారా మన గుండె ఆరోగ్యానికి ఇది చాలా మంచిది. అంతేకాకుండా మనకు రోజు వారి కావాల్సిన శక్తిని అందించడంలో సహాయపడుతుంది దీన్ని ఉదయం పూట తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది: నానబెట్టిన చియా సీడ్స్ ని పరిగడుపున తీసుకోవడం ద్వారా మన శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించుకోవచ్చు. ఇది ఎల్డీఎల్ కొలెస్ట్రాలను  తగ్గించడంలో సహాయపడి మంచి కొలెస్ట్రాల్ పెంచడానికి సహాయపడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది.

Health Tips: కాల్షియం టాబ్లెట్లు అతిగా వాడుతున్నారా

క్యాన్సర్ తగ్గిస్తుంది: చియా సీడ్స్ ను ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా ఇది క్యాన్సర్ తగ్గిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించడంలో ఇది సహాయపడుతుంది. ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు అధికంగా ఉండడం ద్వారా చియా సీడ్స్ తీసుకోవడం వల్ల మనకు క్యాన్సర్ చికిత్సలో ఇది సహాయపడుతుంద.

కంటికి మంచిది: చియా సీడ్స్ లో విటమిన్ ఇ, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇది కంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. జింక్ రెటినాను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడి. దృష్టిలోపాలను తగ్గించి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సీఆర్ సీడ్స్ ఉపయోగపడతాయి.

షుగర్ ను తగ్గిస్తుంది: మధుమేహ సమస్యతో బాధపడేవారు ప్రతిరోజు సీఆర్ సీట్లు తీసుకున్నట్లయితే ఇందులో ఉన్న ఫైబర్ తక్కువ కార్బోహైడ్రేట్స్ వల్ల గ్లైక్సిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఇది టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ఉత్తమం.

ఎముకలకు బలం: చియా సీడ్స్ లో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉన్నాయి. ఇవి మన ఎదుగుదలకు ఎముకల బలానికి సహాయపడుతుంది. ఇది ఎముకల వ్యాధి, ఎముకల పగుళ్లు, బోలు వ్యాధులను తగ్గించడానికి సహాయపడుతుంది.

ఎలా తీసుకోవాలి: చియా సీడ్స్ ను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తీసుకోవాలి. మీరు కావాలంటే అరటిపండు, మ్యాంగో షేక్ లో కూడా చేసుకోవచ్చు.

మజ్జిగలో కూడా కలిపి తీసుకోవచ్చు. చియా సీడ్స్ ను పాలతో కూడా కలిపి తీసుకోవచ్చు.

ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చియాసిడ్స్ ను మీ ఆహారంలో భాగం చేసుకుంటే అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.