Tablets (Photo Credits: Pixabay)

క్యాల్షియం అనేది మన శరీరానికి చాలా ముఖ్యమైనది. మన శరీర ఎదుగుదలకు, ఎముకల దృఢత్వానికి ,దంతాల బలానికి ఈ కాల్షియం చాలా అవసరం. క్యాల్షియం తక్కువగా ఉండటం వల్ల ఎముకలు పెలుసు బారిపోవడం వంటి వ్యాధుల వచ్చే అవకాశం. అయితే ఈ మధ్యన తేలిన పరిశోధనలో క్యాల్షియం సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల గుండెపోటు ప్రమాదం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కనుగొన్నారు.

శరీరానికి ఎంత క్యాల్షియం అవసరం: వైద్యశాస్త్రం ప్రకారం క్యాల్షియం ప్రతిరోజు అవసరం. అయితే ఒక వ్యక్తికి కాల్షియం ప్రతిరోజు 1000నుండి 1300 mg ల కాల్షియం అవసరం ఉంటుంది. అయితే ఇది వారి శరీర దాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. దీని కంటే ఎక్కువగా కాల్షియం తీసుకున్నట్లయితే గుండెపోటు వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి.

అధిక క్యాల్షియం వల్ల గుండెపోటు ప్రమాదం: క్యాల్షియం సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం ద్వారా గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని ఇటీవల పరిశోధనలో వెల్లడైంది. ఈ సప్లిమెంట్స్ అధికంగా తీసుకోవడం వల్ల మన రక్తంలో బ్లాక్ లను ఏర్పరుస్తుంది. ఇది గుండె నాళాలలో అడ్డంకిని కలిగిస్తుంది. దీని ద్వారా గుండెపోటు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా

క్యాల్షియం సప్లిమెంట్స్ ఎవరు తీసుకోకూడదు: క్యాల్షియం మాత్రలు అందరూ తీసుకోకూడదు. ఇదివరకే గుండె జబ్బులు ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా కాల్షియం టాబ్లెట్లు తీసుకోవద్దు. అంతేకాకుండా  కిడ్నీలో రాళ్లు ఉన్నవారు కూడా ఈ కాల్షియం సప్లిమెంట్స్ ను తీసుకోకూడదు. వీరు రోజువారి ఆహారంలో కాల్షియంని ఉండేలాగా చూసుకోవాలి. అంతేకానీ విడిగా కాల్షియం సప్లిమెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు.

సహజ కాల్షియం ఎలా తీసుకోవాలి: కేవలం సప్లిమెంట్స్ ద్వారానే కాకుండా మనం తీసుకునే ఆహార పదార్థాల ద్వారా కాల్షియం తీసుకుంటే ఈ సమస్యలు తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు పాల ఉత్పత్తులు తీసుకుంటే సహజంగానే మీరు కాల్షియంను పెంచుకోవచ్చు. దీని ద్వారా గుండె జబ్బుల నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.