చంటి పిల్లలకు చాలామంది టాల్కం పౌడర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము.
టాల్కం పౌడర్ అధికంగా వాడడం ద్వారా దద్దుర్లు, దురద ఎక్కువగా వచ్చి చిన్న చిన్న కురుపులు కూడా అవుతూ ఉంటాయి. ఇది ఆరోగ్యానికి చాలా హానికరం దానివల్ల జరిగే అనారోగ్య గురించి తెలుసుకుందాం.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది: చంటి పిల్లలకు ఎక్కువగా టాల్కం పౌడర్ యూస్ చేయడం ద్వారా నోటి నుండి ,ముక్కు నుండి చిన్నచిన్న రేణువులు ప్రవేశిస్తాయి. దీని కారణంగా వారికి జలుబు చేసి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగితుంది. అంతేకాకుండా పిల్లల ఊపిరితిత్తుల పైన ప్రభావాన్ని చూపుతుంది.
చర్మం దద్దుర్లు: టాల్కం పౌడర్లో ఎక్కువగా కెమికల్స్ వాడడం ద్వారా ఇది పిల్లల శరీరం పైన దద్దుర్లు ఏర్పడడానికి కారణం అవుతుంది. పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. తరచుగా టాల్కం పౌడర్ యూస్ చేయడం ద్వారా దద్దుర్లు, దురద, చిన్నచిన్న కురుపులు సమస్యలు ఎదుర్కొంటాము. కాబట్టి సాధ్యమైనంత తక్కువగా చర్మం పైన పాల్కం పౌడర్ని వాడాలి.
Health Tips: రేగి పండులో ఉన్న 5 అద్భుత ప్రయోజనాలు.
క్యాన్సర్: టాల్కం పౌడర్ మీద అనేక రకాలైనటువంటి పరిశోధనలు జరిగాయి. ఇది ఒక రకంగా అయినా చర్మకాన్సర్ ను ప్రేరేపించేదిగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో పిల్లలకు టాల్కం పౌడర్ వేయడం చాలా హానికరం. ముఖ్యంగా పిల్లల ప్రైవేట్ భాగాలలో పౌడర్ పోయడం వల్ల కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీరికి తక్కువగా రాయడం ఉత్తమం.
హానికర కెమికల్స్: టాల్కం పౌడర్ లో మెగ్నీషియం, సిలికాన్, ఆక్సిజన్ వంటి వాటితో తయారు చేయబడింది. అంతేకాకుండా ఇవి సోప్ స్టోన్ అని పిలవబడే రాళ్లను ఉపయోగిస్తారు. వీటిని ఈ విధంగా తయారు చేస్తారు. ఇది పిల్లలకే కాదు పెద్దలకు కూడా చాలా హానికరమని తెలిపారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.