Health Tips: బిర్యానీ ఆకులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..జబ్బులను తగ్గిస్తుంది.
దీనిని మసాలా దినుసుగా వాడుతుంటాం. కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
బిర్యానీ ఆకు అందరికీ తెలుసు. దీనిని మసాలా దినుసుగా వాడుతుంటాం. కానీ ఇందులో ఉన్న ఆరోగ్య ఔషధాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
షుగర్ ను తగ్గిస్తుంది- ఈ మధ్యకాలంలో ఎక్కువమంది మధుమేహ సమస్యతో బాధపడుతున్నారు. షుగర్ ఉన్నవారు బిర్యాని ఆకు పొడిని ప్రతిరోజు తీసుకున్నట్లయితే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇవి మార్కెట్లో క్యాప్సిల్స్ రూపంలో కూడా లభిస్తాయి. వీటిని తీసుకోవడం ద్వారా మీ ఇన్సులిన్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని ద్వారా మీ మధుమేహం నియంత్రించబడుతుంది.
శ్వాసకోశ సమస్యలు- సమస్యలు ఉన్నవారు బిర్యాని ఆకులను ఎండబెట్టి పొడి చేసుకుని మీరు ఆహారంలో భాగం చేసుకుంటే ఇది శ్వాసనాలంలో ఏర్పడ్డ ఇన్ఫ్లమేషను తగ్గిస్తుంది. ఇందులో ఉండే ఇతనోలిక్ అనేటువంటి పదార్థము శ్వాసకోశంలో ఉన్న ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది దగ్గు, ఆస్తమా, ఫ్లూ వంటి వాటి నుండి కూడా బయటపడేస్తుంది.
దంతాలకు మంచిది- బిర్యానీ ఆకుల పొడిని మీరు పళ్ళు తోమినట్లయితే మీ దంతాలు, చిగుళ్ళ, నుండి వచ్చే నొప్పి చెడు వాసనను పోగొడుతుంది, ఈ బిర్యానీ ఆకు విటమిన్ సి తో నిండడం వల్ల ఇది మీ చిగుళ్ళను దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీనితో మీరు పళ్ళను తోమితే మీ నోట్లో ఉన్న బాక్టీరియా తొలగిపోతుంది.
Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి.
ఫంగల్ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది- బిర్యానీ ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇది ఈస్ట్ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది. మన శరీరంలో ఏదైనా భాగంలో ఎలర్జీ లేదా ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు బిర్యాని ఆకు పొడిని నూనెలో కలిపి మరిగించి ఆ నూనెను ఎలర్జీ ఉన్న ప్రాంతంలో అప్లై చేసినట్లయితే మీకు ఈ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
బరువు తగ్గుతారు- బిర్యానీ ఆకుల పొడిని మీరు ప్రతి రోజు కషాయం లాగా చేసుకుని తాగితే మీరు బరువు తగ్గుతారు. ఇది మీ బరువులు కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది. ఇది క్యాలరీలను బర్న్ చేయడం చేసి అధిక బరువు నుండి బయట పడేస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.