Health Tips: ప్రతిరోజు నారింజ పండును తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా.
ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా మన శరీరానికి ఎంతో శక్తిని అందిస్తుంది.
నారింజపండు రుచికి పుల్లగా ఉంటూ ఎన్నో ఆరోగ్య గుణాలు కలిగి ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రుచికి మాత్రమే కాకుండా మన శరీరానికి ఎంతో శక్తిని అందిస్తుంది. మన శరీరానికి కావలసిన అనేక ఆరోగ్య ప్రయోజనాలు నారింజలో ఉన్నాయి. ప్రతిరోజు ఒక నారింజపం తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
రోగ నిరోధక శక్తి- నారింజ పండులో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది. దీని ద్వారా మనకు రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నారింజ పండును క్రమం తప్పకుండా తినడం వల్ల మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. దీని ద్వారా ఈ సీజ,న్లో వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి వ్యాధుల నుండి బయటపడేస్తుంది. డెంగ్యూ, మలేరియా చికెన్ గున్యా, టైఫాయిడ్ వంటి వైరల్ ఫీవర్ ల నుండి కూడా బయటపడేస్తుంది.
బరువు తగ్గుతారు- నారింజ పండులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని ద్వారా మనం బరువు తగ్గడానికి ఈ నారింజపండు సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా మన శరీరంలో ఉన్న కొవ్వు తగ్గుతుంది.
Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా.
గుండెకు మంచిది- నారింజ పండులో యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం మెగ్నీషియం, విటమిన్ సి పుష్కలంగా ఉండడం ద్వారా మన గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అంతేకాకుండా రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. దీని ద్వారా గుండె ప్రమాద గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజు నారింజపండును తీసుకోవడం ద్వారా మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చర్మానికి మంచిది- ఆరెంజ్ లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండడం ద్వారా మన చర్మాన్ని కి చాలా మంచిది . శరీరంలో పేర్కొన్న టాక్సిన్స్ ను బయటికి పంపించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా కొత్త రక్త కణాలు ఏర్పడతాయి. దీని ద్వారా వృద్ధాప్య ఛాయలు తగ్గిపోతాయి. ప్రతిరోజు ఒక నారింజపండు తీసుకోవడం ద్వారా మీ చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవచ్చు. నారింజ పండ్లను తీసుకోవడం ద్వారా మొటిమలు మచ్చలు కూడా తగ్గిపోతాయి.
ఎముకలకు మంచిది- చాలామంది క్యాల్షియం, డి విటమిన్ లోపంతో ఉంటారు. నారింజలో కాల్షియము, విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి. ఇది ఎముకలకు దంతాలకు చాలా సహాయపడుతుంది. పిల్లల్లో వృద్ధులలో గర్భిణీలలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. అటువంటివారు ప్రతిరోజు ఒక నారింజ పండ్లను తినడం ద్వారా మీ ఎముకలకు ఎముకల బలానికి సహాయపడుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.