మూత్రపిండాలు మన శరీరంలో ఉన్న అనేక రకాలైనటువంటి హానికరమైన వ్యర్థాలను బయటికి పంపించడానికి పనిచేస్తాయి. మూత్రపిండాల పనితీరు మందగించినప్పుడు లేదా బలహీన పడినప్పుడు అనేక రకాల వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా ప్రారంభ సంకేతాల గురించి మనం ఈరోజు తెలుసుకున్నట్లయితే మూత్ర విసర్జన లో మార్పు మూత్ర విసర్జనకు సంబంధించిన కొన్ని రకాల సమస్యలను మనం ఎదుర్కొంటాము అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రం రంగులో మార్పు- మీ మూత్రపిండాల పనితీరు మందగించినట్లయితే మూత్రం రంగులో మార్పు వస్తుంది. మూత్రం రంగు లేత గులాబీ లేదా ఎరుపు రంగులోకి కనిపిస్తే లేదా రక్తం కనిపించినట్లయితే మీకు కిడ్నీలు ఫెయిల్యూర్ కి దగ్గరగా ఉన్నట్టు సంకేతం.
Health Tips: అధిక వేడి ఉన్న నీరుతో స్నానం చేయడం వల్ల కలిగే నష్టాలు..
మూత్రంలో రక్తం- కొన్నిసార్లు మూత్ర విసర్జన సమయంలో రక్తం కనిపించినట్లయితే మూత్రపిండాల సమస్య ఉన్నట్టుగా చెప్పవచ్చు. మూత్ర నాలంలో తీవ్రమైన సమస్యకి ఇది సంగీతంగా చెప్పవచ్చు. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం లేదా తీవ్రమైన మూత్రపిండాల వ్యాధిని మూత్రంలో రక్తం రావడం అనేది సూచిస్తుంది.
మూత్ర విసర్జన ఎక్కువ లేదా తక్కువ- కొన్నిసార్లు మూత్ర విసర్జన అధికంగా ఉంటుంది. నీటిని సరిగ్గా ఫిల్టర్ చేయకుండా మీరు తాగిన నీరును అదే విధంగా కంటిన్యూగా మూత్రం ద్వారా విసర్జన చేస్తూ ఉంటుంది. ఇది కూడా ఒక సమస్యగా చెప్పవచ్చు.
మూత్ర విసర్జన తగ్గడం- మూత్రం ప్రవాహం మందగిస్తుంది ఇది కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతంగా చెప్పవచ్చు. మీరు గనక రోజుల్లో కేవలం రెండు నుంచి మూడు సార్లు మాత్రమే విసర్జన చేస్తున్నట్లయితే మీకు మూత్రపిండాల వ్యాధి వస్తున్నట్లుగా సంకేతం.
మూత్ర విసర్జన సమయంలో నొప్పి లేదా మంట- మూత్ర విసర్జన సమయంలో నొప్పి మంట అసౌకర్యంగా అనిపిస్తే అది మూత్రపిండాల వ్యాధికి లేదా ఇన్ఫెక్షన్లు లేదా రాళ్లు లేదా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను సూచిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి