astrology

జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. దీనిని దేవ గురు గ్రహం అని కూడా అని అంటారు. జ్ఞానం సంపద విద్య వివాహాలకు కారణంగా ఈ గ్రహాన్ని చెప్పవచ్చు. అయితే గురు గ్రహం నవంబర్ 28వ తేదీన రోహిణి నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని కారణంగా ఈ మూడు రాశులు వారికి అదృష్ట ఇప్పుడు రాశులు తెలుసుకుందాం.

కర్కాటక రాశి- గురు గ్రహ రాశి మార్పు కారణంగా కర్కాటక రాశి వారి పైన శుభప్రభావాలు ఉంటాయి. ఉద్యోగస్తులు వారి యజమానులతో సత్యంగా ఉంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారస్తులకు ధన సంపాదనలో ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. గురు గ్రహం అనుగ్రహం వల్ల పిల్లల పెద్దల ఆరోగ్యం కూడా బాగుంటుంది. సీజనల్ వ్యాధుల ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. వ్యాపార విస్తరణ కోసం విదేశాల్లో పెట్టుబడులు పెట్టాలన్న కల నెరవేరుతుంది. అది లాభాలను తీసుకువస్తుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేయాలన్న కల నెరవేరుతుంది. పాత అప్పుల నుండి ఉపశమనం పొందుతారు.

Vastu Tips: నల్లచీమలు ఇంట్లో కనిపిస్తే మంచిదేనా, 

మీన రాశి- మీన రాశి వారికి గురు గ్రహం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. గురు గ్రహానుగ్రహం వల్ల వీరు తగినంత డబ్బును సంపాదిస్తారు. ఉద్యోగంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. ప్రమోషన్లు లభిస్తాయి. దీనివల్ల మీ ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారవేత్తలకు రానున్న రోజుల్లో గణనీయమైన లాభాలు ఉంటాయి. పెట్టుబడుల నుండి మంచిరాబడి పొందే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళతారు. భాగస్వాముల మధ్య ఉన్న విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు.

తులారాశి- తుల రాశి వారికి గురుగ్రహం అనుగ్రహం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణ కోసం మీరు చేసే ప్రణాళికలు విజయవంతం అవుతాయి. లాభాలను తీసుకువస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వివాహాలకు అనుకూలం. పెద్దన ఆరోగ్యం పట్ల సంతోషంగా ఉంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇది తల్లిదండ్రులకు ఆనందాన్ని ఇస్తుంది కోరుకున్నచోట సీటు లభిస్తుంది. కోర్టు సమస్యల నుంచి బయటపడతారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం మత విశ్వాసాల ఆధారంగా పేర్కొనడం జరిగింది. జ్యోతిష్యం, జాతకం విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు.