Newdelhi, Nov 17: ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్ (AIDS) వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ (HIV) వైరస్ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్ లోని బయోటెక్ స్టార్టప్ కంపెనీ ఇమ్యునో క్యూర్ ప్రకటించింది. ఇటీవల తాము చేసిన క్లినికల్ ట్రయల్స్ లో ఈ టీకా పనితీరు బాగున్నదని, సత్ఫలితాలు కనిపించాయని తెలిపింది. షెంజెన్ థర్డ్ పీపుల్స్ హాస్పిటల్ లో 45 మంది రోగులపై ఈ పరీక్షలు జరిగినట్లు వివరించింది. సంప్రదాయ టీకాలు రోగ నిరోధకంగా ఉపయోగపడతాయని, తాము థెరప్యూటిక్ వ్యాక్సిన్ ను అభివృద్ధి చేశామని చెప్పింది.
Vaccine shows promise in curing HIV, Hong Kong biotech start-up says
‘We may be on the brink of a breakthrough,’ Dr Edward Leong, advisory board chairman of Immuno Cure sayshttps://t.co/9q00ijxceQ
— Dennis Koch (@DennisKoch10) November 15, 2024
అలా నయం
హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత తమ థెరప్యూటిక్ వ్యాక్సిన్ ను ఇచ్చి ఎయిడ్స్ రోగాన్ని నయం చేయవచ్చునని కంపెనీ వెల్లడించింది. తమ వ్యాక్సిన్ ను తీసుకున్నవారిలో అత్యధికులకు టీ-సెల్స్ (తెల్ల రక్త కణాలు) స్పందనలు రెట్టింపు అయ్యాయని తెలిపింది. త్వరలోనే ఈ టీకాను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వివరించింది.
మణిపూర్ సీఎం నివాసంపై దాడి, మరోసారి రణరంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సురక్షితం