Health Tips: చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచి, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారాలు.
దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం.
చలికాలం వచ్చిందంటే చాలు రోగనిరోధక వ్యవస్థ బలహీన పడుతుంది. దీని ద్వారా అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉంటాము. అయితే శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం కోసం మనము వెచ్చటి దుస్తులు వాడుతూ ఉంటాం. అలా కాకుండా మన శరీరం లోపట కూడా కొన్ని ఆహార పదార్థాలు వేడిని కలిగిస్తాయి. వెచ్చగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా చలికాలంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. అటువంటి ఆహారాలను తీసుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉంటాయి. శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే కొన్ని ఆరోగ్యకరమైన ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటిని మనం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా చలికాలంలో అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి బయటపడవచ్చు.
డ్రై ఫ్రూట్స్- చలికాలంలో ఖర్జూరం, అంజీర, బాదం, జీడిపప్పు వంటి డ్రైఫ్రూట్స్ అధికంగా తీసుకోవాలి వీటిలో గుడ్ ఫాట్స్ ఉంటాయి. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. ఇది శరీరంలో రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది.
Health Tips: ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా కారణాలు, నివారణ ...
నువ్వులు- చలికాలంలో నువ్వుల్ని తీసుకోవడం ద్వారా చాలా మేలు జరుగుతుంది. నువ్వులను లడ్డూల రూపంలో తీసుకోవచ్చు. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా ఇందులో క్యాల్షియం, పొటాషియం, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు మేలు చేస్తుంది. అంతే కాకుండా ఇమ్యూనిటీని పెంచుతుంది.
అల్లం- అల్లం లో ధర్మోజోనిక్ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది శరీరంలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. మన జీర్ణ క్రియను వేగంగా పెంచుతుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. అల్లంలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడతాయి. శీతాకాలంలో అల్లంను టీ రూపంలో లేదా డికాషన్ రూపంలో తీసుకోవడం ద్వారా మన శరీరం వెచ్చగా ఉంటుంది. మెటబాలిజాన్ని కూడా క్రమబద్ధీకరిస్తుంది.
బెల్లం- బెల్లంని చలికాలంలో ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. దీన్ని తీసుకోవడం ద్వారా మన శరీరానికి తక్షణ శక్తి అందుతుంది. అంతేకాకుండా జీలక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లంలో ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం అంటే పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పుల నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. చలికాలంలో చాలామందిలో కీళ్ల నొప్పుల సమస్య ఇబ్బంది పెడుతుంది. అటువంటివారు బెల్లాన్ని తీసుకోవడం ద్వారా అనేక రకాలుగా ఉపశమనాన్ని కలిగిస్తుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి