Lungs (Photo Credits: Wikimedia Commons)

ఈ మధ్యకాలంలో చాలామంది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారు. దీనికి బ్యాక్టీరియా ,వైరల్ ,ఫంగల్ ఇన్ఫెక్షన్ లాంటివి కూడా కారణాలు అవుతాయి. కొన్నిసార్లు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నిమోనియాగా మారుతుంది. దీనివల్ల చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది- ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తుల్లో వాపు ,కఫం ఏర్పడుతుంది. ఇది శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిని కలిగిస్తుంది.

జలుబు దగ్గు -ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అత్యంత సాధారణంగా కనిపించే లక్షణాలు జలుబు దగ్గు ఇవి రెండూ కూడా కఫంతో ఏర్పడి ఉంటాయి ఒక్కొక్కసారి దగ్గులో రక్తం కూడా రావడం ప్రారంభిస్తుంది అటువంటి అప్పుడు ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ అని చెప్పవచ్చు. అటువంటి అప్పుడు మీరు వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది.

జ్వరం, తలనొప్పి- ఇన్ఫెక్షన్ కారణంగా జ్వరము ,తలనొప్పి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా శరీరంలో అన్ని భాగాల్లో కూడా తిమ్మిరిగా అనిపిస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల చలి జ్వరం కూడా ఏర్పడుతుంది.

ఛాతిలో నొప్పి- ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఊపిరితిత్తుల వాపు ఏర్పడుతుంది. దీనివల్ల ఛాతిలో నొప్పి ఏర్పడుతుంది. తగ్గినప్పుడు లేదా ఎక్కువ శ్వాస తీసుకున్నప్పుడు ఈ ఛాతి నొప్పి మరింతగా పెరుగుతుంది. కొన్నిసార్లు వీపు వెనుక భాగంలో కూడా తీవ్రమైన నొప్పి ఉంటుంది.

వాంతులు, వికారం- ఎక్కువ అయినప్పుడు వాంతులు వికారం కూడా అనిపిస్తుంది. కొన్నిసార్లు దీనివల్ల బలహీనంగా కూడా అనిపిస్తుంది. గొంతులో నొప్పి వాపు చిరాకు వంటి సమస్యలు కూడా పెరుగుతాయి.

ఇన్ఫెక్షన్ తగ్గడానికి ఈ ఆహారాలు నియమాలు పాటించాలి.

అల్లం- అల్లం ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఉపరితల ఏర్పడిన ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అల్లంలో యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శ్వాసకోశ వాక్కును తగ్గించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా కఫం ని తొలగించడంలో కూడా అల్లం సహాయపడుతుంది.

Health Tips: మీరు ప్రోటీన్ లోపంతో బాధపడుతున్నారా..

తులసిటి- తులసిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన ఊపిరితులను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు ప్రతిరోజు నాలుగు తులసకుల్ని తినడం గానీ లేదా టీ రూపంలో గానీ తీసుకోవడం వల్ల ఉపరితల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

పసుపు- పసుపు యాంటీ బ్యాక్టీరియల్ ,యాంటీ ఇన్ఫ్లమేట్ గా పనిచేస్తుంది. అంతేకాకుండా పసుపులో కర్క్యుమెంట్ అనే మూలకం ఉంటుంది. ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. దీని ద్వారా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.

నిమ్మకాయ- నిమ్మకాయల విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాకుండా గొంతులో మంటను తగ్గిస్తుంది. ఇది డిటాక్షన్ గా కూడా పనిచేస్తుంది. శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు నిమ్మకాయ రసాన్ని ప్రతిరోజు తీసుకున్నట్లయితే ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. అయితే ఇవి పాటించేటప్పుడు ఒకసారి మీ వైద్యుల్ని సంప్రదించడం ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి