Health Tips: విటమిన్ డి తో బాధపడుతున్నారా..కారణాలు,చికిత్స తెలుసుకుందాం.
బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యం పైన సరైన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా సూర్యకాంతి సరిగ్గా లభించదు
ఈ మధ్యకాలంలో తరచుగా చాలామందిలో డి విటమిన్ లోపం కనిపిస్తుంది. బిజీ షెడ్యూల్ కారణంగా ఆరోగ్యం పైన సరైన దృష్టి పెట్టారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకోవడం ద్వారా సూర్యకాంతి సరిగ్గా లభించదు. దీనివల్ల డి విటమిన్ లోపం అనేది వస్తుంది. డి విటమిన్ మన శరీరానికి కావలసిన ఒక ముఖ్యమైన పోషకం. ఇది సహజంగా సూర్య కాంతి నుండి వస్తుంది. అయితే కొన్నిసార్లు డి విటమిన్ లోపము వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. దేశ జనాభాలో 70 నుండి 80 శాతం వరకు విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారు. విటమిన్ లోపం వల్ల మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో దాని లోపాన్ని మనం ఎలా అధిగమించాలో ఈరోజు మనం తెలుసుకుందాం.
విటమిన్ డి లోపాన్ని గుర్తించడం.
సాధారణంగా మనము డి విటమిన్ లోపాన్ని గుర్తించడం చాలా ముఖ్యం. దీన్ని సరైన సమయంలో చికిత్స తీసుకున్నట్లయితే మనము ఈ లోపం నుండి బయటపడవచ్చు. మన శరీరం కొన్ని రకాల సంకేతాలను ఇస్తుంది. ముఖ్యంగా అలసట, బలహీనత, రోజంతా నీరసంగా అనిపించడం, విటమిన్ డి లోపానికి సంకేతం. ఎముకల్లో నొప్పి, కండరాల్లో నొప్పి, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం కూడా విటమిన్-డి లోపం లక్షణం.
కారణాలు.
ఎండలో తక్కువగా ఉండడం- మన శరీరంలో డి విటమిన్ లోపానికి ప్రధాన కారణంగా చెప్పుకున్నట్లయితే మనము ఎండలో తక్కువగా ఉండడం, ద్వారా మనకు డి విటమిన్ సరిగ్గా మన శరీరం ఉత్పత్తి చేయదు. ఈ మధ్యకాలంలో అందరూ ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటున్నారు .కాబట్టి అటువంటి వారికి ఈ డి విటమిన్ లోపం అనేది ఎక్కువగా వస్తుంది.
Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా
ఆహారం- కొంతమంది వెజిటేరియన్స్ గుడ్లు, మాంసం, వంటివి తీసుకోరు దీని వల్ల కూడా విటమిన్ డి లోపం అనేది వస్తుంది. కాబట్టి ఈ సమస్య మాంసాహారం తీసుకునే వారి కంటే శాకాహారం తీసుకునే వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు విటమిన్ డి యొక్క లోపాన్ని కలిగి ఉంటారు
అధిక బరువు- అధిక బరువు ఉన్నవారికి కూడా విటమిన్ డి లోపానికి కారణం గా ఉంటారు వీరి శరీరంలో అధికంగా కొవ్వు ఉంటుంది కాబట్టి ఇది రక్తంలో తక్కువగా ఉంటుంది. ఉబకాయం ఉన్నవారికి శరీరానికి డి విటమిన్ అవసరం ఎక్కువగా ఉంటుంది. సాల్మన్, ఎగ్స్, మాంసాహారం ,పాల ఉత్పత్తులు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే వీరు డి విటమిన్ లోపం నుండి బయటపడుతారు.
నివారణ- విటమిన్ డి లోపంతో బాధపడేవారు కొన్ని రకాలైనటువంటి పద్ధతుల ద్వారా ఈ లోపాన్ని అధిగమించవచ్చు. ఎక్కువ సమయం ఎండలో ఉండాలి. అదేవిధంగా పోషకాహారం తీసుకోవాలి. ముఖ్యంగా సాల్మన్ ట్యూనా ఫ్యాట్ ఫిష్ వంటి వాటిని తీసుకున్నట్లయితే మీకు డి విటమిన్ లభిస్తుంది. తృణధాన్యాలు నట్స్ మొలకలు తీసుకున్నట్లయితే మీకు డి విటమిన్ లభిస్తుంది.
మీరు డి విటమిన్ లోపంతో ఇంకా ఎక్కువ సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే వైద్యుని సంప్రదించి వాటి స్థాయిలను చెక్ చేసుకొని విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవాలి. ఇవి టాబ్లెట్ల రూపంలోనూ క్యాప్సిల్స్ రూపంలోనూ లభిస్తాయి. ఈ పద్ధతులను ఉపయోగించడం ద్వారా మీరు డి విటమిన్ లోపం నుండి బయటపడతారు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.