Health Tips: ఎసిడిటీ, గ్యాస్ సమస్య తరచుగా ఇబ్బంది పెడుతుందా ,అయితే ఇది క్యాన్సర్ సంకేతం కావచ్చు జాగ్రత్తపడండి..

ఇది 25 నుంచి 40 ఏళ్ల వయసు వారి మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైంది.

gas

ఈ మధ్యకాలంలో తరచుగా కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతుంది. ఇది 25 నుంచి 40 ఏళ్ల వయసు వారి మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. కొలెక్టెరల్ క్యాన్సర్ అనేది చాలా తీవ్రమైంది. అయితే దీని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స చేసుకున్నట్లయితే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. అయితే ఎక్కువగా ఇది గ్యాస్ ఎసిడిటీ సమస్య నుంచి సంకేతాలను ఇస్తుంది.

కొలన్ క్యాన్సర్ అంటే ఏమిటి

ఇది దీన్నే పెద్ద పేగు క్యాన్సర్ అని కూడా అని అంటారు. ఈ మధ్యకాలంలో ఏ వయసులో ఉన్నవారు కూడా దీనికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా మధుమేహం సమస్య ఉన్నవారికి ఈ క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40% ఎక్కువగా ఉంది. పురుషులలో స్త్రీలలో ఇద్దరికీ ఈ పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే సమస్య ఉంది. అయితే ముఖ్యంగా ఇది పురుషుల్లో ఎక్కువగా కనిపిస్తుంది.

Health Tips: నువ్వుల్లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు..

కారణాలు- అధిక కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవడం ,మీట్ ,ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్య పెరుగుతుంది. అంతేకాకుండా కుటుంబంలో ఎవరికన్నా ఈ  క్యాన్సర్ సమస్య ఉన్నట్లయితే వచ్చే ఛాన్సెస్ శ్రమ లేకపోవడం, ముఖ్యంగా అధిక బరువు ఉన్న వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది.

లక్షణాలు- మలవిసర్జన సమయంలో రక్తం ఎక్కువగా పడడం ఆకస్మికంగా బరువు తగ్గడం, కడుపులో నొప్పి, లేదా అసిడిటీ, తీవ్రమైన తిమ్మిరి గా ఉండడం ,అతిసారం లేదా మలబద్ధకం వంటి సమస్యలు అంతేకాకుండా తీవ్రంగా అలసట, బలహీనంగా ఉండడం వంటి లక్షణాలుగా కనిపిస్తాయి.

నివారణ- ఫైబర్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవాలి. అంతేకాకుండా పండ్లు కూరగాయలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ఉత్తమం. అంతేకాకుండా మీరు అధిక బరువుతో బాధపడితే బరువును కచ్చితంగా అదుపులో ఉంచుకోవాలి. ధూమపానం, మద్యపానం చేయకూడదు. అటువంటి వారికి ఈ కొలను క్యాన్సర్ అనేది ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత 50 ఏళ్ళు దాటిన వారిలో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం. కుటుంబంలో ఎవరికైనా ఇటువంటి క్యాన్సర్ గనుక ఉన్నట్లయితే తప్పకుండా వైద్యుని సంప్రదించడం మంచిది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి