Health Tips: రక్తంలో ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో సమస్యకు పరిష్కారం..

రక్త సరఫరా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి.

Bacteria | Image used for representational purpose (Photo Credits: Pixabay)

మన శరీర అవయవాల అన్నిటికీ రక్తం చాలా అవసరం. రక్త సరఫరా ఉంటేనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా రక్తంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినప్పుడు అనేకరకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా త్వరగా అలసిపోవడం బరువు తగ్గడం, కడుపులో సమస్యలు రావడం ,శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, కొలెస్ట్రాల్ స్థాయి వంటివి కారణం కావచ్చు. అయితే కొన్ని రకాల సహజ పద్ధతుల ద్వారా మన రక్తాన్ని శుద్ధి చేసుకోవచ్చు. అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

వేప ఆకులు- రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గించడానికి వేప చాలా బాగా ఉపయోగపడుతుంది. వేపాకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఒక ఐదు నుంచి పది వేపాకుల నమలడం ద్వారా రక్తం శుద్ధి అవుతుంది.

ఉసిరి- ఉసిరిలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో ఉన్న టాక్సిన్స్ బయటకు పంపించడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయాన్నే ఉసిరి రసం తాగడం లేదా ఉసిరికాయ తినడం ద్వారా రక్తం లో ఉన్న ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది.

పసుపు- పసుపు రక్తశుద్ధికి ఒక చక్కటి ఎంపికగా చెప్పవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని ప్రతి రోజు రాత్రిపూట తాగితే రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా కూడా తొలగిపోతుంది.

Health Tips: చలికాలంలో పచ్చి బఠానీలు తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు..

తులసి- తులసిలో యాంటీ ఆక్సిడెంట్లు ,యాంటీ మైక్రోబియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు తులసాకులను తిన్నట్లయితే లేదా తులసాకులతోటి తయారు చేసుకొని తాగినట్లయితే శరీరంలో ఉన్న వ్యర్ధాలు అన్ని బయటకు పోయి రక్తశుద్ధి అవుతుంది.

త్రిఫల చూర్ణం- త్రిఫల చూర్ణం రక్తాన్ని శుద్ధి చేయడంలో చాలా బాగా సహాయపడుతుంది. అంతేకాకుండా ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మలబద్ధకం సమస్యతో బాధపడే వారికి ఇది చక్కటి ఉపశమనగా చెప్పవచ్చు. ప్రతిరోజు రాత్రి గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూన్ త్రిఫల చూర్ణం వేసుకొని తాగినట్లయితే రక్తంలోని ఇన్ఫెక్షన్లు అన్నీ కూడా తొలగిపోతాయి.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif