Health Tips: తరచుగా ముక్కు కారడం, దగ్గు వంటి సమస్యతో బాధపడుతున్నారా ఈ హోమ్ రెమెడీస్ తో వెంటనే పరిష్కారం.
మారుతున్న వాతావరణంలో దీని ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల ఈ జలుబు, ముక్కు కారడం, దగ్గు వంటివి సమస్యలు పెరుగుతూ ఉంటాయి.
సీజన్ మారుతున్న కొద్దీ చాలామందిలో ఇబ్బంది పెట్టే సమస్య జలుబు. మారుతున్న వాతావరణంలో దీని ప్రభావం రోజురోజుకు పెరుగుతుంది. ఉష్ణోగ్రతలో మార్పుల వల్ల ఈ జలుబు, ముక్కు కారడం, దగ్గు వంటివి సమస్యలు పెరుగుతూ ఉంటాయి. తరచుగా ముక్కు కారడం వంటి సమస్యను తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే జలుబు మందులను వాడుతూ ఉంటారు. వీటివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. దీనికోసం మనం ఇంట్లోనే చేసుకునే కొన్ని చిట్కాల వల్ల ఈ సమస్య నుండి బయటపడవచ్చు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆవిరి పట్టడం- ముక్కు కార సమస్య ఉన్నప్పుడు సులభమైన అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఇది ఒకటి. ఒక గిన్నెలో వేడి నీళ్లు పోసుకుని అందులో ఒక చెంచా పసుపు కొంచెం జండుబాంని కలిపి ఆవిరి పీల్చినట్లయితే ముక్కులో ఉన్న స్లైష్మమంతా కూడా కరిగిపోయి బయటికి వచ్చి ముక్కు కారడం సమస్య నుంచి బయటపడతారు.
Health Tips: కిడ్నీలో రాళ్లు రావడానికి ఈ ఆహార పదార్థాలే కారణం..
వాము- వాము కూడా ముక్కు కారడ సమస్యని తగ్గిస్తుంది. వామును వేయించి ఒక కర్చీఫ్ లో వేసుకొని వాసన చూసినట్లయితే ముక్కు కారడం, జలుబు దగ్గు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
తులసి కషాయం- తులసకుల కషాయం కూడా జలుబు, దగ్గు ముక్కు కారణమంటే సమస్యలను తగ్గిస్తుంది. తులసాకులను తీసుకొని శుభ్రంగా చేసుకొని వాటిని ఒక గిన్నెలో పోసుకొని కషాయం చేసుకొని దాని తాగినట్లయితే ముక్కు కారడం సమస్య కూడా తగ్గుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి