source:pixabay

చాలామంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా ఇది మన ఆహార పదార్థాల అలవాట్లు ,అనేక రకాల చెడు అలవాట్ల వల్ల ఈ సమస్య వస్తుంది. కిడ్నీలో రాళ్ల వల్ల తీవ్రమైన నొప్పి ఉంటుంది. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం కొన్ని రకాలైనటువంటి ఆహారపు అలవాట్లను చేర్చుకోవాలి. అయితే ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

కిడ్నీ స్టోన్స్ కారణాలు- కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి ప్రధానంగా కొవ్వు పదార్థాలు నీరు తక్కువగా తీసుకోవడం ఫాస్ట్ ఫుడ్ అధిక తీపి పదార్థాల వల్ల ఈ సమస్య వస్తుంది.

లక్షణాలు- కిడ్నీలో రాళ్లు ఏర్పడినప్పుడు కడుపులో తీవ్రమైన నొప్పి వాంతులు, వికారం, జ్వరము కామెర్లు వంటి సంకేతాలు కనిపిస్తాయి.

ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి..

ఆయిల్ ఫుడ్స్- అధికంగా వేయించిన ఆహార పదార్థాలు పకోడీలు, సమోసాలు, బేకరీ ఐటమ్స్ వంటి వాటిని తగ్గించడం వల్ల కిడ్నీలో రాళ్ల ప్రమాదం తగ్గుతుంది. వీటిలో అధికంగా కొవ్వు పదార్థాలు ఉండడం ద్వారా ఇది కిడ్నీలో రాళ్ల ప్రమాదం పెంచుతుంది. కాబట్టి వీటిని తగ్గించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Health Tips: రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతున్నారా..

మైదాపిండి- మైదా పిండిలో ట్రాన్స్ఫార్ట్లు అధికంగా ఉంటాయి. ఇవి కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి సహాయపడతాయి. బ్రెడ్, పిజ్జా, బిస్కెట్లు వంటి వాటిని తీసుకోవడం మానివేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

ఆల్కహాల్- ఆల్కహాల్ అధికంగా తాగే వారిలో కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. ఇది దాని సామర్ధ్యాన్ని ప్రభావితం చేసి రాళ్లను పెంచే సమస్యను పెంచుతుంది. కాబట్టి ఆల్కహాల్ తగ్గించడం ద్వారా కిడ్నీలో రాళ్ల సమస్య తగ్గుతుంది.

తీయటి పదార్థాలు- కేకులు, కుకీలు సోడా వంటి వాటిలలో అధికంగా చెక్కర ఉపయోగించే పదార్థాలను వాడటం ద్వారా కూడా కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. వీటితో పాటు కొలెస్ట్రా స్థాయిని కూడా పెంచుతాయి. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.

ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు- ఉప్పు, చక్కర కొవ్వు అధికంగా ఉండే ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు కిడ్నీలో రాళ్లు ఏర్పడడానికి వేగవంతం చేస్తాయి. వీటిని తగ్గించడం కోసం మనము ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వేయించిన బ్రెడ్ పిజ్జా ఆహార పదార్థాలను తగ్గించాలి. ఎప్పుడు కూడా తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవాలి. నీరు అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి