Health Tips: సయాటికా నొప్పితో బాధపడుతున్నారా, అయితే పెయిన్ కిల్లర్లను వాడకుండా ఈ చిట్కాలతోటి ఉపశమనం పొందవచ్చు..
సయాటిక్ అనే నరాల వల్ల కలిగే ఈ నొప్పి వీపు నుంచి మొదలయ్యి తుంటి కాళ్ల వరకు కూడా నొప్పిగా అనిపిస్తుంది.
ఈ మధ్యకాలంలో చాలామందిలో సయాటికా నొప్పి చాలా ఇబ్బంది పెడుతుంది. సయాటిక్ అనే నరాల వల్ల కలిగే ఈ నొప్పి వీపు నుంచి మొదలయ్యి తుంటి కాళ్ల వరకు కూడా నొప్పిగా అనిపిస్తుంది. సయాటికా నొప్పి ఉన్నప్పుడు ఒక కాలులో ఎక్కువగా ఈ నొప్పి అనేది తెలుస్తుంది. ఒక్కోసారి ఇది తీవ్రమైన నొప్పిగా ఉంటుంది. అయితే దీనికి గల కారణాలు లక్షణాలు నివారణల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సయాటికా నొప్పికి కారణాలు- వెన్నుముకలు డిస్క్ జారడము చీలిపోవడం వెనుక చిక్కి పోవడం వంటివి సయాటిక్ నరాల మీద ఒత్తిడి కలిగిస్తుంది. అటువంటి అప్పుడు ఈ సయాటికా నొప్పి అనేది ఏర్పడుతుంది. వెన్నుపాములో గుజ్జు ఖాళీ అవ్వడం వల్ల కూడా ఈ సయాటికా నొప్పి అనేది ఏర్పడుతుంది. తుంటి కండరాలలో సంకోచం కారణంగా కూడా ఈ నరాలకు నొప్పి అనేది ఏర్పడుతుంది. కొంతమందిలో గర్భం దాల్చినప్పుడు బరువు నరాల మీద పడడం వల్ల ఒత్తిడి కలిగిస్తుంది. అటువంటి అప్పుడు కూడా సయాటికా నొప్పి అనేది ఏర్పడుతుంది. అధిక వ్యాయామం లేదా ఎక్కువ బరువు ఉన్న వస్తువుల్ని ఎత్తడం వల్ల కూడా కండరాల పైన ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సయాటికా నొప్పికి కూడా కారణం అవుతుంది.
లక్షణాలు- సయాటికా నొప్పి లక్షణాలు వీపు కింద నుంచి కాళ్ల వరకు కూడా ఈ నొప్పి అనేది ఉంటుంది. నడవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటారు. కాళ్లలో తిమ్మిర్లు జలదరింపులు బలహీనతగా ఏర్పడుతుంది. అంతే కాకుండా కండరాలలో అలసత్వం ,బలహీనత ,ఎక్కువ సేపు నడవలేకపోవడం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎక్కువసేపు కూర్చున్న లేదా ఎక్కువ సేపు నడిచినా కూడా లేదా నిలబడ్డా కూడా ఈ సయాటికా నొప్పి అనేది పెరుగుతుంది.
Health Tips: ఇంగువలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?
నివారణలు-
హాట్ అండ్ కోల్డ్ కంప్రెస్- వేడి లేదా చల్లటి కంప్రెస్ ద్వారా వాపును తగ్గించుకోవడంలో సహాయపడుతుంది. ఇది కండరాలకు విశ్రాంతిని ఇవ్వడానికి సహాయపడుతుంది. ప్రతిరోజులో 15 నుంచి 20 నిమిషాల పాటు హాట్ కంప్రెస్స్ లేదా కోల్డ్ కంప్రెషను ఉపయోగించడం ద్వారా ఈ సయాటికా నొప్పి నుంచి బయటపడవచ్చు.
వ్యాయామం- కొన్ని రకాల ఆసనాల వల్ల సయాటికా నొప్పిని తగ్గించవచ్చు. వెన్నుముకకు బలాన్ని చేకూరుస్తుంది. అయితే ఇవి చేసేటప్పుడు వైద్యులను సంప్రదించి మాత్రమే ఈ వ్యాయామాలు యోగాలు చేయడం ఉత్తమం.
ఈ నొప్పి 4 నుంచి 8 వారాల పాటు కొనసాగితే నొప్పి భరించలేనంతగా ఉండి రెండు కాళ్లకు కూడా వ్యాపించినట్లయితే ఆలస్యం చేయకుండా వైద్యుని సంప్రదించడం ముఖ్యం. సయాటిక నొప్పిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స తీసుకున్నట్లయితే అది తీవ్రమైన సమస్యగా మారదు.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి