pixabay

భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో ఇంగువ వాడుతూ ఉంటారు. ఇంగువను వేయడం వల్ల ఆహారానికి రుచి పెరగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఇంగువను తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అజీర్ణం- ఇంగువను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. చాలామంది కడుపుబ్బరం కడుపులో నొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి వారికి ఇంగువను ఒక గ్లాసు గోరువెచ్చటి నీటిలో కలిపి ఇచ్చినట్లయితే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. అంతేకాకుండా ఆహారాన్ని త్వరగా జీర్ణం చేస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..

తలనొప్పి- చాలామందిలో తరచుగా తలనొప్పి వంటి సమస్యను చూస్తూ ఉంటాం. కొంతమందిలో టెన్షన్ ఒత్తిడి కారణంగా తలనొప్పి సమస్య ఏర్పడుతుంది. దీనికోసం వారు మార్కెట్లో లభించే పెయిన్ కిల్లర్స్ ను వాడుతారు. ఇవి సైడ్ ఎఫెక్ట్స్ ను చూపిస్తాయి. మీకు తలనొప్పి మా సహజంగానే తగ్గాలి అంటే వెంటనే ఇంగువను పేస్ట్ లాగా చేసుకుని తల పైన రాసుకుంటే తలనొప్పి తగ్గి వెంటనే ఉపశమనం లభిస్తుంది.

వాపులు- చాలామందిలో కాళ్లవాపు చేతుల వాపు మొహం వాపు అంటే సమస్యతో బాధపడుతుంటారు. ఇటువంటి వారిలో చాలా అసౌకర్యాన్ని కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల వీడు వీరు ఇంగువను పొడి చేసుకొని నీటిలో కలిపి తాగినట్లయితే వెంటనే ఉపశమనం లభిస్తుంది. శరీరంలో పేరుకుపోయిన వ్యర్ధాలను బయటికి పంపించి వాపును తగ్గిస్తుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి