Health Tips: కడుపులో అల్సర్ సమస్యతో బాధపడుతున్నారా..ఎలాంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు.

gas

కడుపులో అల్సస్ ఏర్పడ్డాన్ని పెప్టిక్ అల్సర్ అని కూడా అంటారు. ఇది చాలా ఇబ్బందికరమైన సమస్య అల్సర్ తో బాధపడుతున్న వారికి కడుపులో మంటగా ఏది తినలేక తీవ్రమైన నొప్పితోటి ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వారు ఏది తిన్నా కూడా వారి లక్షణాలు ఇంకా తీవ్రవాలుతాయని బాధపడుతూ ఉంటారు. అటువంటి వారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకున్నాం.

అల్సర్స్ రావడానికి ప్రధాన కారణం

కడుపులో  అల్సర్  రావడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ బుక్ ప్రోఫిన్ స్టెరాయిడ్ వంటి యాంటీ ఇంఫ్లమెంటరీ మందులను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. రెండవ కారణం పైలోరి అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా కడుపులో అల్సర్ వచ్చే ప్రమాదాలు ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా వీరిలో ధూమపానం చేసేవారు ఎక్కువ స్పైసీ ఫుడ్ తీసే తీసుకునేవారు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారు. ఈ సమస్య ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది.

అల్సర్ ఉన్నవారు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి

ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలు- కడుపులో అల్సర్ సమస్యతో బాధపడేవారు ఎక్కువగా ఫైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఆకుకూరలు, బ్రకోలి, వంటి వాటిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా ఇది మీ కడుపులోని  అల్సర్ తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజు కనీసం 30 గ్రాముల ఫైబర్ తీసుకోవడం ద్వారా మీకు అల్సర్ రాకుండా ఉంటుంది.

పెరుగు- పెరుగులో ప్రోబయోటిక్ ఇది కడుపులో ఉన్న అల్సర్ తగ్గించడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా హెలికా బ్యాటర్ పైలోరి బ్యాక్టీరియా అనే ఇన్ఫెక్షన్ తో బాధపడేవారు. ఈ ప్రోబయాటిక్ రిచ్ గా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా మీ జీర్ణ వ్యవస్థ సమతుల్యమై అల్సర్స్ ను తగ్గిస్తుంది.

పండ్లు- బొప్పాయి, ఆపిల్, పుచ్చకాయ వంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఇది మీ కడుపులో ఉన్న అల్సర్  తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా నారింజ, నిమ్మ, ద్రాక్ష పండు వంటివి తీసుకోకూడదు. ఇందులో ఎసిడిక్ నేచర్ ఎక్కువగా ఉండటం ద్వారా ఇది కడుపులోని అల్సర్ ఎక్కువగా చేస్తుంది. దీని ద్వారా మీకు చాలా ఇబ్బంది కలుగుతుంది.

Health Tips: కరివేపాకులో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయో తేలుసా 

చేపలు- చేపలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది కడుపులో ఏర్పడ్డ అల్సర్ తగ్గించడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా కొన్ని రకాలైన చేపల్లో సాల్మన్ మాకే రైల్ వంటి చేపలలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. దీని ద్వారా మీ కడుపులో ఏర్పడ్డ అల్సర్ తగ్గుతాయి.

మీకు ఈ సమస్య అధికంగా ఉంటే డాక్టర్ సలహా మేరకు మందులు తీసుకొని వాడాల్సి ఉంటుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif