Health Tips: దంతాల సమస్యతో బాధపడుతున్నారా..అయితే ఇవి అనారోగ్యానికి సంకేతం కావచ్చు.

దంతాలు కలిగి ఉండడం మంచిదే అయితే కొన్నిసార్లు దంతాల సమస్యతో బాధపడుతుంటారు.

Teeth (Credits: X)

దంతాలు కేవలం ఆహారం నమ్మడానికి మాత్రమే కాదు మన అందాన్ని పెంపొందించడానికి కూడా ఇవి కనిపిస్తాయి. దంతాలు కలిగి ఉండడం మంచిదే అయితే కొన్నిసార్లు దంతాల సమస్యతో బాధపడుతుంటారు. అది కేవలం దంత సమస్య మాత్రమే కాదు అది మన శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు సంకేతంగా చెప్పబడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె సమస్యలు- దంతాలు ,చిగుళ్ళ నుండి రక్తం రావడం ,వీటన్నిటికీ కూడా గుండె ఆరోగ్యానికి లింక్ అనేది ఉంటుంది. దంత సమస్యలతో పోరాడే వారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండెపోటు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. చిగుళ్ల నుండి రక్త శ్రావం పళ్ళు ఊడిపోవడం సమస్య ఉంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి.

పోషక ఆహార లోపం- తరచుగా నోటి అల్సర్ తోటి నోటి పూతల తోటి బాధపడుతుంటే అది రక్తహీనతకు సంకేతంగా చెప్పవచ్చు. మన శరీరంలో విటమిన్ బి 12 లోపం వల్ల కూడా ఈ నోటి పూత నోటి అల్సర్లు వస్తాయి. ఈ సమస్య పదే పదే వస్తున్నట్లయితే ఒకసారి పరీక్ష చేయించుకోవడం ఉత్తమం.

Health Tips: మీరు కూడా అధికంగా టీకి అలవాటు పడ్డారా.

ప్రేగు పూత- పేగు పూత ఒక్కొక్కసారి మన నోటి సమస్యల వల్ల కూడా వస్తుంది. మీ దంతాల సమస్య అధికమైనప్పుడు పేగు సమస్య సంకేతంగా కనిపిస్తుంది.

ఒత్తిడి- చాలామంది ఒత్తిడికి గురవుతున్నప్పుడు వారి దంతాలు అరిగిపోవడం లేదా పుచ్చు పోవడం వంటి సమస్యలు వస్తాయి. అలాంటి వచ్చినప్పుడు మీరు ఒత్తిడికి గురవుతున్నారని సంకేతం. ఒత్తిడికి గురైనప్పుడు దవడ మెడ తలనొప్పి వంటి సమస్యలు కూడా వస్తాయి.

కాలేయ సమస్యలు- కొన్నిసార్లు చిగుళ్ళను రక్తస్రావం ,నోటిపూతల సమస్య నిరంతరంగా ఉంటే మీకు కాలేయ సమస్యలు ఉన్నట్టుగా చెప్పవచ్చు.

మోనోపాజ్- మోనోపాజ్ తర్వాత మహిళల్లో దంతాల సమస్య మరి ఎక్కువగా ఉంటుంది. ఇది చిగుళ్ళను కూడా ప్రభావవంతం చేస్తుంది. చిగుళ్లలో వాపు చిరాకు అల్సర్ సమస్య పెరుగుతుంది. అప్పుడు వీరు మోనోపాజ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు.

దంతాలు అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా సూచన కాబట్టి మీరు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు జాగ్రత్తగా రెగ్యులర్ గా చెకప్ లు చేయించుకుంటే మీ దంతాలను కాపాడుకోవచ్చు. అంతేకాకుండా తీవ్రమైన వ్యాధుల నుండి కూడా బయటపడవచ్చు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి. 



సంబంధిత వార్తలు