IPL Auction 2025 Live

Health Tips: షుగర్ పేషంట్స్ నెయ్యి తినవచ్చా, మితంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..

నెయ్యిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అయితే నెయ్యి వాడడంలో కొన్ని అనుమానాలు ఉన్నాయి.

ghee

ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు నెయ్యిని వాడొచ్చా లేదా అనే అనుమానాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే దేశీయ నెయ్యిని వాడడం మంచిదే అని డాక్టర్లు చెబుతున్నారు. నెయ్యిలో మంచి కొవ్వులు, క్యాల్షియం ,ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఇవి డయాబెటిక్ రోగులకు మంచిదే అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

శక్తిని ఇస్తుంది- నెయ్యిలో సంతృప్తి కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి మధుమేహ రోగులకు మంచిది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి. ఇన్సులిన్ స్థాయిలను నియంత్రణలో ఉంచడానికి నెయ్యి సహాయపడుతుంది అని కాకుండా ఇవి శక్తిని కూడా ఇస్తుంది.

Health Tips: కాకరకాయతో కలిపి ఈ ఆహార పదార్థాలను కలిపి అస్సలు తినకండి..

ఇన్సులిన్ నిర్వహణ- నెయ్యిలో ఒమేగా 3 ఒమేగా 6 వంటి ఫ్యాటి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇది రక్తంలోని చక్కెర లెవల్ కంట్రోల్లో ఉంచడానికి సహాయపడుతుంది..

గుండెకు మంచిది- నెయ్యిలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇది గుండెకు మేలు చేస్తుంది. దీంట్లో గుడ్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. కాబట్టి మితంగా తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి