Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.

దీని వల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మీరు అనేక రకాలుగా ఆ రోమాలను తీస్తూ ఉంటారు.

కొంతమంది మహిళల్లో అవాంఛిత రోమాలు సమస్య అనేది ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల వారు తీవ్ర అసౌకర్యానికి గురవుతారు. మీరు అనేక రకాలుగా ఆ రోమాలను తీస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా అవి మళ్ళీ మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అయితే అవాంచిత రోమాలు రావడానికి గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఆండ్రోజన్- మహిళల్లో ఆండ్రోజిన్ అనే పురుష హార్మోను ఎక్కువ పరిమాణంలో విడుదలయితే అటువంటి మహిళల్లో అవాంఛత రోమాలు వస్తాయి. వీరికి గడ్డం పై పెదవి పైన వెంట్రుకలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది మహిళల్లో హార్మోనల్ ఇన్ బాలన్స్ వల్ల పిసిఒఎస్ కారణంగా ఈ సమస్యలు తలెత్తుతాయి.

కార్టి సాల్- కార్టీ సెల్ అనే హార్మోను అధికంగా ఉత్పత్తి అవ్వడం ద్వారా మగవారిలో లాగా గడ్డం మీసాలు వచ్చే అవకాశాలు ఏర్పడతాయి. మహిళల్లో ఇలా ఏర్పడడాన్ని అడ్రినల్ హైపర్ ప్లాసియా అని అంటారు. కొన్నిసార్లు అనే హార్మోను తక్కువగా ఉత్పత్తి అయినప్పుడు కూడా ముఖం పైన అవాంఛిత రోమాలు ఏర్పడతాయి. థైరాయిడ్ ఉన్న మహిళల్లో కూడా ఈ సమస్య అధికంగా ఉంటుంది. ఆర్థరైటిస్ ఆస్తమా వంటి సమస్యల్లో మందులు వాడడం వల్ల కూడా కొంతమంది మహిళల్లో అవాంఛిత రోమాల సమస్య ఏర్పడుతుంది.

Health Tips: బ్లడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా.

గర్భనిరోధక మాత్రలు- కొంతమంది మహిళల్లో గర్భనిరోధక మాత్రలు తరచుగా వాడుతూ ఉంటారు. దీనివల్ల వారి శరీరంలో  ఆండ్రోజిన్ అనే హార్మోను స్థాయి పెరుగుతుంది. దీనివల్ల మహిళల్లో అవాంఛిత రోమాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. అధిక బరువు ఉన్న వారిలో కూడా ముఖం పైన వెంట్రుకలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

తొలగించుకునే విధానం- కొంతమంది వ్యాక్సింగ్ ,సేవింగ్ ,ఫ్లకింగ్, త్రెడ్డింగ్ వంటి పద్ధతులను ఉపయోగించి అవాంఛిత రోమాలను తొలగించుకుంటారు. అయితే కొన్ని కొన్ని సార్లు వైద్యుల సలహా మేరకు కొంతమంది లేజర్ ట్రీట్మెంట్లను కూడా తీసుకుంటారు. ఇంకా మార్కెట్లో వచ్చే రకరకాల అయినటువంటి క్రీములు కూడా అవాంచిత రోమాలను తీసుకోవచ్చు. కొంత మందిలో అధిక బరువు థైరాయిడ్ సమస్య వల్ల ఈ సమస్య వస్తుంది. అటువంటివారు దాన్ని కంట్రోల్ లో ఉంచుకొని బరువు తగ్గడం ద్వారా ఇది సహజంగా తగ్గిపోతుంది.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif