Health Tips: గర్భాశయం బలహీనంగా ఉండడానికి కారణాలు ,నివారణ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
స్త్రీ శరీరంలో ప్రత్యేకమైన భాగాలలో గర్భాశయం ఒకటి. గర్భశ్యం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది మహిళల్లో బలహీనమైన గర్భాశయం ఉంటుంది.
ప్రతి స్త్రీకి తల్లి కావాలని కల ఉంటుంది. స్త్రీ శరీరంలో ప్రత్యేకమైన భాగాలలో గర్భాశయం ఒకటి. గర్భశ్యం ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. కొన్నిసార్లు కొంతమంది మహిళల్లో బలహీనమైన గర్భాశయం ఉంటుంది. ఇది గర్భం దాల్చడానికి ఇబ్బందిని కలిగిస్తుంది. గర్భస్రావం అయ్యే అవకాశాలను పెంచుతుంది. అయితే గర్భశయము బలహీనంగా ఉందని ఎలా తెలుసుకోవచ్చు. దానికి కారణాలు వాటి సంకేతాలు మరియు నివారణలు కూడా ఎలాగో తెలుసుకుందాం..
బలహీన గర్భాశయం సంకేతాలు- గర్భశ్యం బలహీనంగా ఉన్నప్పుడు మహిళల్లో పెల్విక్ ప్రాంతంలో తీవ్ర ఒత్తిడి ఉంటుంది. అంతేకాకుండా పెల్విక్ ప్రాంతంలో బరువుగా కూడా ఉంటుంది. ఇది బలహీన గర్భాశయానికి సంకేతంగా చెప్పవచ్చు. గర్భశయం బలహీనంగా ఉన్నప్పుడు దాని ఆకృతి కూడా మారుతుంది. గర్భాశయం బలహీనంగా మారడానికి ముఖ్యంగా జీవనశైలిలో మార్పు ప్రధానంగా చెప్పవచ్చు. అయితే గర్భాశయము బలహీనంగా మారినప్పుడు ఎటువంటి సమస్యలు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెల్విక్ ప్రాంతంలో నొప్పి, పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం, వెన్నునొప్పి, వైట్ డిశ్చార్జ్, మలబద్ధకం, యోని చుట్టూనొప్పి ,మంట వంటి సమస్యలు ఏర్పడతాయి.
బలహీనమైన గర్భాశయానికి కారణాలు- మానసిక బలహీనత మానసికంగా ఆరోగ్యం దెబ్బతినడం కొన్నిసార్లు ప్రసవం తర్వాత కూడా గర్భాశయం బలహీనంగా మారుతుంది. కొన్నిసార్లు గాయాలు కావడం ద్వారా కూడా గర్భాశయం బలహీనపడుతుంది. మనం తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల కూడా ఇది ఏర్పడుతుంది. ముఖ్యంగా జంక్ ఫుడ్ చెడు ఆహారపు అలవాట్లను తీసుకోవడం ద్వారా బలహీనమైన జీవనశైలిని అవలంబించడం ద్వారా గర్భాశయం బలహీన పడుతుంది.
గర్భాశయాన్ని బలంగా ఉంచే మార్గాలు.
Health Tips: మిరియాలను అధికంగా వాడడం వల్ల కలిగే నష్టాలు ఏమిటో తెలుసా..
ఆహారం- మనం తీసుకునే ఆహారం పైన కాస్త శ్రద్ధ వహించినట్లైతే గర్భశయాన్ని బలంగా మార్చుకోవచ్చు. ముఖ్యంగా ఆహారంలో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆసిడ్స్, ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు, క్యాల్షియం ఉన్న ఆహార పదార్థాలు పండ్లు, ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్, నిమ్మ జాతికి చెందిన పండ్లను తీసుకోవడం ద్వారా గర్భాశయం బలంగా ఉంటుంది. అంతేకాకుండా ప్రోటీన్, పొటాషియం ,ఐరన్ వంటి పోషకాలు ఉన్న ఆహార పదార్థాలను భాధలు చేసుకోవడం ద్వారా గర్భాశయం బలంగా మారుతుంది.
వ్యాయామం- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ఉత్తమం. ఇది శరీరంలో రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. గర్భస ఆరోగ్యానికి చాలా ముఖ్యం. బరువును అదుపులో ఉంచుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. దీని ద్వారా గర్భాశయం బలంగా మారుతుంది.
ఒత్తిడి తగ్గించుకోవాలి- శారీర ఆరోగ్యతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా ముఖ్యము. ఒత్తిడి పెంచే హార్మోన్లను తగ్గించుకోవడం మంచిది. ఒత్తిడి తగ్గించుకోవడం కోసం యోగాసనాలు, జ్ఞానం వంటివి చేసినట్లయితే ఇది మీ మానసిక ఆరోగ్యం పైన ప్రభావాన్ని చూపుతుంది.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి