Health Tips: బూడిద గుమ్మడి కాయ జ్యూస్ లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఇవే...అయితే ఎవరు ఈ జ్యూస్ తాగకూడదో తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుమ్మడికాయ రసాన్ని తాగుతున్నారు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి ముందుగా గుమ్మడికాయ రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా గుమ్మడికాయ రసాన్ని తాగుతున్నారు దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొంతమంది మాత్రం వీటికి దూరంగా ఉండాలి ముందుగా గుమ్మడికాయ రసంలో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. గుమ్మడికాయలో 96% నీరు ఉంటుంది అంతేకాకుండా ఇందులో క్యాల్షియం ఐరన్ పొటాషియం మెగ్నీషియం, విటమిన్ బి బి టు బి త్రీ బి 6 వంటి అధికంగా ఉంటాయి.
బూడిద గుమ్మడికాయలో ప్రోబయాటిక్స్ కూడా అధికంగా ఉంటాయి. దీని ద్వారా మన శరీరంలో ఉన్న మంచి బ్యాక్టీరియాను పెంపొందిస్తుంది. జీర్ణ వ్యవస్థకు చక్కగా పనిచేస్తుంది. ఇది ఒక యాంటాసిడ్ గా పనిచేసి అజీర్ణం కడుపుబ్బరం కడుపునొప్పి గ్యాస్ ప్రాబ్లం ను తగ్గిస్తుంది.
Health Tips: బొప్పాయి పండు లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా
బరువు తగ్గిస్తుంది: బరువు తగ్గాలి అనుకునే వారికి బూడిద గుమ్మడికాయ రసం ఒక అద్భుత వరమని చెప్పవచ్చు ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి ఫ్యాట్ ఉండదు 90% నీరు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ గా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ అధికంగా ఉండడం ద్వారా మీరు తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేస్తుంది. వ్యర్ధాలను బయటికి పంపించడం ద్వారా మీరు అధిక బరువు నుండి బయటపడతారు.
టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది: బూడిద గుమ్మడికాయ రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేర్కొన్న టాక్సించడం బయటికి పంపిస్తుంది దీని ద్వారా మీ చర్మానికి మంచి నిగారింపు లభిస్తుంది ఇందులో ఉండే గుణాల వల్ల మీకు యాంటీ ఏజంగా కూడా పనిచేస్తుంది.
ఎవరు తీసుకోకూడదు.
జలుబు జ్వరం: జలుబు, జ్వరం ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కూడా గుమ్మడికాయ రసాన్ని తీసుకోకూడదు ఎందుకంటే ఇది చలవ చేసే గుణాన్ని కలిగి ఉంటుంది కాబట్టి దీనివల్ల మీకు జలుబు సమస్య మరింత తీవ్రమవుతుంది.
Health Tips: కాల్చిన వెల్లుల్లిని పురుషులు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ...
గర్భిణీలు తీసుకోకూడదు: బూడిద గుమ్మడికాయ రసాన్ని ఎట్టి పరిస్థితుల్లో గర్భిణీలు తీసుకోకూడదు.
ఆస్తమా పేషెంట్స్: ఆస్తమా ఉన్నవారు కూడా ఈ బూడిద గుమ్మడికాయ రసాన్ని డాక్టర్ సలహా మేరకు తీసుకోవాలి.