Health Tips: ఈ ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పచ్చిగా తినకూడదు.
వాటిని కొంతమంది పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
ఆకుకూరలు కూరగాయలు మన ఆరోగ్యానికి చాలా మంచివి. వాటిని కొంతమంది పచ్చిగా సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. కొన్ని ఆహార పదార్థాలను పచ్చిగా తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. దీని ద్వారా గ్యాస్ సమస్యలు, అజీర్ణం, కడుపునొప్పి వంటివి వస్తాయి. అయితే ఏ కూరగాయలను మనము పచ్చిగా తీసుకోకూడదు ఇప్పుడు తెలుసుకుందాం.
టమాటో- పచ్చి టమాటాలో సోలనిన్ అనే రసాయన పదార్థం ఉంటుంది. ఇది అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ముఖ్యంగా కడుపునొప్పి, గ్యాస్ వంటివి సమస్యను కలిగిస్తుంది. ఒక రసాయన పదార్థం. ఇది టమాటాలలో అధికంగా ఉంటుంది. ఇది మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి చాలా కష్టం. దీని ద్వారా మనకు అజీర్ణం కొన్నిసార్లు వాంతులు వంటి సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి టమాటాలను ఎప్పుడైనా సరే ఉడికించి తీసుకోవాలి.
క్యాలీఫ్లవర్, క్యాబేజీ- క్యాలీఫ్లవర్ ,క్యాబేజీ వంటి క్రూసిఫెరస్ కూరగాయలను ఎప్పుడూ కూడా పచ్చిగా తీసుకోకూడదు. దీని ద్వారా ఎసిడిటీ వంటి సమస్యలు పెరుగుతాయి. కడుపునొప్పి, అజీర్ణం వంటి సమస్యలు పెరుగుతాయి. కాబట్టి వీటిని ఉడికించి తీసుకోవడం ఉత్తమం. దీని ద్వారా మన జీర్ణ క్రియ కు మంచిది.
Health Tips: థైరాయిడ్ జబ్బు ఉన్నవారు కోడిగుడ్డు తినవచ్చా.
ముల్లంగి- పచ్చి ముల్లంగిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. దీని ద్వారా కడుపునొప్పి, గ్యాస్ సమస్య పెరుగుతుంది. ఇందులో అనేక రకాలైన రసాయనాలు ఉంటాయి. దీని తీసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. గుండెల్లో మంట, గ్యాస్ జీర్ణ సమస్యలు కలిగిస్తాయి. ఇందులో ఫైబర్ అధికంగా ఉండి కడుపునొప్పికి దారితీస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ముల్లంగిని వండిన తర్వాత మాత్రమే.
బీన్స్- పచ్చి బీన్స్ కూడా తీసుకోకూడదు.పచ్చి బీన్స్ లు తీసుకోవడం ద్వారా మన జీర్ణ వ్యవస్థకు చాలా ఇబ్బంది కలుగుతుంది. ఇది జీర్ణం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. దీని ద్వారా కడుపునొప్పి, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు కూడా ఉడికించి తీసుకోవడం ఉత్తమం.
క్యాప్సికం- క్యాప్సికమ్ ను చాలామంది సలాడ్స్ రూపంలో తీసుకుంటారు. అయితే అలా తీసుకోవడం అంత మంచిది కాదు. పచ్చి క్యాప్సికంలో కొన్ని రకాలైనటువంటి పారాసిడ్స్ ఉంటాయి. ఇవి మన మెదడుకు కడుపుకు మంచిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల మనము ఈ ప్రమాదకర బ్యాక్టీరియాలను దూరం చేసుకోవచ్చు.
పాలకూర- పాలకూర పచ్చిగా తినడం చాలా ఆరోగ్యానికి హానికరం. ఇందులో ఆక్సలైట్స్ అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండాల్లో రాళ్లను కలిగిస్తుంది. దీని ద్వారా మనకు మన శరీరానికి తగినంత కాల్షియం అందదు. అందుకే ఎప్పుడైనా సరే పాలకూరను ఉడికించి తీసుకోవడం ఉత్తమం.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి