ఈ రోజుల్లో థైరాయిడ్ సమస్య చాలా మందిలో ఉంటుంది. దీనికి సరైన ఆహారం అలవాట్లు తీసుకుంటే ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్నవారు ప్రోటీన్ ని ఆహారంలో ఎక్కువగా భాగం చేసుకుంటే వీరి ఆరోగ్యానికి చాలా మంచిది.
పోషకాలు- గుడ్డులో ప్రోటీన్ అధిక శాతం లో ఉంటుంది. దీన్ని తీసుకోవడం ద్వారా థైరాయిడ్ సమస్య ఉన్నవారికి థైరాయిడ్ తగ్గించడానికి సహాయపడుతుంది.
అయోడిన్- కోడిగుడ్డులో అయోడిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంధి పనితీరును సక్రమంగా నిర్వహించడానికి తగిన హార్మోన్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది. కోడిగుడ్డు తీసుకుంటే మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. దీనిలో ఉన్న ప్రోటీన్, అయోడిన్ థైరాయిడ్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
సెలీనియం- కోడిగుడ్డులో యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. ఇందులో సెలీనియం కూడా ఉంటుంది. ఈ సెలీనియం థైరాయిడ్ హార్మోన్ ను దాని పనితీరులో మెరుగుపరచడానికి సహాయపడుతుంది. సెలీనియం అనేది ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇది. మన శరీరంలోని ఫ్రీ రాడికల్స్ తో పోరాడి థైరాయిడ్ గ్రంధి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి థైరాయిడ్ వ్యాధి ప్రభావాన్ని తగ్గిస్తుంది.
Health Tips: అర్జున బెరడులో ఉన్న ఔషధ గుణాలు తెలుసా
విటమిన్ డి- కోడిగుడ్డులో డి విటమిన్ పుష్కలంగా ఉంటుంది. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి ఇది చాలా ముఖ్యమైనది. ఇందులో విటమిన్ డి తో పాటు క్యాల్షియం స కూడా పెరగడానికి ఈ సహాయపడుతుంది. దీని ద్వారా థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి డి విటమిన్ అనేది సహాయపడుతుంది. అందుకే ప్రతిరోజు మీరు ఒక కోడిగుడ్డు తీసుకోవడం ద్వారా మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా విటమిన్ డీన్ కూడా అందించిన వారు అవుతారు.
విటమిన్ బి 12- థైరాయిడ్ సమస్యతో బాధపడే వారికి విటమిన్ బి12 అన్నది చాలా అవసరమైన విటమిన్ ఈ విటమిన్ బి 12 కోడిగుడ్డులో పుష్కలంగా ఉంటుంది. దీని తీసుకోవడం ద్వారా థైరాయిడ్ తో ఉన్న సమస్యలు తగ్గుతాయి.
ఎలా తీసుకోవాలి- కోడిగుడ్లను ఉడికించి తీసుకుంటే ప్రోటీన్ అనేది ఎక్కువగా అందుతుంది. వీటిని మీరు బ్రేక్ ఫాస్ట్ లోను స్నాక్స్ రూపంలోనూ చేర్చుకోవచ్చు. అంతేకాకుండా కూరగాయలతో కలిపి ఆమ్లెట్ రూపంలో కూడా చేసుకుంటే మీకు పోషకాలు రుచికరంగా ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి గుడ్డు మంచి ఆహారంగా చెప్పవచ్చు. ఇందులో ఉండే అయోడిన్, సెలీనియం, విటమిన్ బి12, విటమిన్ డి వంటి పోషకాలు థైరాయిడ్ ను తగ్గించడానికి సహాయపడతాయి.
Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.