Cinnamon (Credits: X)

కొలెస్ట్రాల్ శాతం మన శరీరంలో ఎక్కువైనప్పుడు అనేక రకాలైన జబ్బులు వస్తాయి. ముఖ్యంగా అది గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే కొలెస్ట్రాల్ స్థాయిలను మనం తగ్గించుకోవడం కోసం ఆయుర్వేదంలో చక్కటి ఔషధ గుణాలు ఉన్న కొన్ని మొక్కలు ఉన్నాయి. అందులో అర్జున బెరడు అర్జును బెరడు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది. ఇది మనము ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాలను తగ్గించి దాని ద్వారా వచ్చేటువంటి అనేక రకాలైన జబ్బులు తగ్గించుకోవడానికి సహాయపడుతుంది.

అర్జున బెరడు ప్రయోజనాలు.

గుండె జబ్బులను తగ్గిస్తుంది- అర్జునుడును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి. ఇది బ్లాక్ లను తగ్గిస్తుంది అంతేకాకుండా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అర్జును బెరడును తీసుకోవడం ద్వారా మీకు గుండెకు మంచిది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది- అర్జున పెరగడం యాంటీ కొలెస్ట్రాల్ గా పని చేస్తుంది. ఇది మన రక్తంలోని చెడు కొలెస్ట్రాలైన LDL కొలెస్ట్రాల తగ్గించి మంచి కొలెస్ట్రాల్ HDLపెంచడానికి సహాయపడుతుంది. అర్జున బెరడు పొడిని నీరు లేదా పాలతో కలిపి తీసుకోవచ్చు. లేదా దీని ఉడకబెట్టి కషాయం లాగా చేసుకుని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మార్కెట్లో ఇవి క్యాప్సిల్స్ రూపంలో కూడా లభిస్తున్నాయి. వైద్యుల సలహా మేరకు వీటిని తీసుకోవచ్చు.

Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి.

బీపీని తగ్గిస్తుంది- అర్జున బెరడు రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది అధిక రక్తపోటు వల్ల మీ గుండెపైన అధిక ఒత్తిడి కలిగి గుండె జబ్బులకు  కారణమవుతుంది. అర్జున బెరడును తీసుకుంటే రక్తపోటును తగ్గించి ఈ జబ్బులు రాకుండా చేస్తుంది.

బరువు తగ్గుతారు- అర్జున బెరడులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాకుండా మన మెటబాలిజం రేట్లు మెరుగుపరుస్తుంది. జీర్ణ క్రియను సక్రమంగా చేయడం ద్వారా మలబద్ధకం సమస్య కూడా తగ్గిపోతుంది. దీని ద్వారా మన పొట్టలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించే అవకాశాలు ఈ అర్జున బెరడులో ఉన్నాయి.

కిడ్నీలకు మంచిది- అర్జున బెరడును ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగించడంలో సహాయ పడతాది దీని ద్వారా మనకు ఇడ్లీలకు పనితీరును మెరుగుపరుస్తుంది.

ఎలా తీసుకోవాలి.

అర్జున బెరడు పొడి అన్ని ఆయుర్వేదం షాపులలో లభిస్తుంది. ఒక గ్లాసు నీరులో కానీ పాలలో కానీ ఒక స్పూన్ కలుపుకొని ప్రతిరోజు ఒకసారి తీసుకోండి.

అర్జున బెరడు ఉడకబెట్టి కషాయం లాగా చేసుకుని కూడా తాగొచ్చు.

అంతేకాకుండా మార్కెట్లో అర్జున బెరడు క్యాప్సిల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి డాక్టర్ సలహా మేరకు తీసుకోవచ్చు.అర్జున బెరడులో అనేక రకాలైన ఔషధ గుణాలు ఉన్నందున ఇది మీ గుండె ఆరోగ్యానికి, ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. మీరు అర్జున బెరడును తీసుకోవడానికి ముందు ఒకసారి వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యం.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి.