Health Tips: రోజంతా ఎనర్జిటిక్ గా ఉండాలనుకుంటున్నారా..పాలతో ఈ ఆహార పదార్థాలు కలిపి తీసుకోండి.

ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్ మెగ్నీషియం అధికంగా ఉంటాయి. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా వేగంగా బరువు పెరగతారు. అయితే పాలతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది.

milk

పాలు తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా పాలు తీసుకోవడం వల్ల క్యాల్షియం, విటమిన్స్ మెగ్నీషియం  అధికంగా ఉంటాయి. పాలు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా  వేగంగా బరువు పెరగతారు. అయితే పాలతో పాటు ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మీ శరీర నిర్మాణానికి ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

అరటి పళ్ళు పాలు: అరటిపండు ఎంతో ఎనర్జీని ఇస్తుంది. ఇందులో అధిక మొత్తంలో క్యాలరీలు కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది తక్షణ శక్తికి ఎంతో ఉపయోగపడుతుంది. అరటిపండు రెగ్యులర్ తీసుకోవడం ద్వారా మన బరువు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. అరటిపండును పాలతో కలిపి తీసుకోవడం వల్ల వేగంగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా రోజంతటికి కూడా కావాల్సిన శక్తి ఏర్పడుతుంది.

బాదంపాలు: బాదంపప్పులో ఎన్నో ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. బాదంను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మన శరీరంలో శక్తి ఏర్పడుతుంది. బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే మిక్సీ చేసుకొని పాలతో కలిపి తీసుకుంటే ఈజీగా బరువు పెరుగుతారు. అంతేకాకుండా మీ శరీరానికి కావాల్సిన శక్తి ఏర్పడుతుంది.  ఈ పాలు ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మీ చర్మం జుట్టుకి ఎంత ఉపయోగకరంగా ఉంటుంది

పాలు, తేనె: తేనెలో యాంటీబయోటిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు అధికంగా ఉంటాయి.  ఇన్ఫెక్షన్ల బారి నుండి బయటపడుతుంది. అయితే ప్రతిరోజు పాలతో కలిపి ఒక స్పూన్ తేనె కలుపుకొని తీసుకోవడం ద్వారా మీకు రోజంతటికి కావలసిన శక్తి ఏర్పడుతుంది లభిస్తుంది. క్రమంగా బరువు కూడా పెరుగుతారు.

Health Tips: నిద్రలేమి వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటో తెలుసా

అంజీర్ పండ్లు: అంజీర్లో రక్తహీనతను తగ్గించే అమోఘమైన పోషకాలు ఉన్నాయి. అంతే కాకుండా దీంట్లో మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫాస్ఫరస్, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరగాలనుకున్నవారు ప్రతిరోజు అంజీర పళ్ళను పాలతో కలిపి తీసుకోవడం ద్వారా మీరు బరువు పెరుగుతారు. అంతేకాకుండా మీ శరీరానికి శక్తి ఏర్పడుతుంది. దీనివల్ల మీరు రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు.

ఖర్జూరం: ఖర్జూరలో ఐరన్, ఫైబర్, క్యాల్షియం అధికంగా ఉంటాయి. పాలలో నానబెట్టి పొద్దుటే మిక్సీ చేసుకొని ఈ పాలు తాగినట్లయితే మీ శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. ఇది మన ఎముకల దృఢత్వానికి కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది.

అశ్వగంధ:  అశ్వగంధ ఆయుర్వేద మూలికల్లో మొదటి స్థానంలో ఉంది. ఇది అనేక వ్యాధులను న్యాయం చేయడానికి ఉపయోగపడతాయి. అశ్వగంధలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.  ఒత్తిడిని తగ్గించి గుణాలు ఇందులో అధికంగా ఉన్నాయి. మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది రోజంతా ఉత్సాహంగా ఉంటారు.

Disclaimer: పైన పేర్కొన్న సమాచారం వైద్య సలహా కాదు. పై సమాచారానికి ఎలాంటి శాస్త్రీయ రుజువులు లేవు. ఈ సమాచారాన్ని లేటెస్ట్ లీ ధృవీకరించడం లేదు. మీకు ఏదైనా అనారోగ్యం తలెత్తితే వెంటనే సర్టిఫైడ్ డాక్టర్ ను సంప్రదించండి



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif